Mysaa Movie:టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక, డైరెక్టర్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో కాబోతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మైసా. ఈ సినిమా వాస్తవంగా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం హాట్ టాపిక్ గా మారింది. నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రావాల్సిన ఈ సినిమా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ సినిమా వాయిదా వెనుక సినిమా క్లైమాక్స్ ప్రధాన కారణం అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా ప్రచారం జరుగుతుంది
క్లైమాక్స్ విషయంలో చిత్ర బృందం అసంతృప్తి..
ఇటీవల ఈ సినిమా ఫైనల్ కాపీని చూసిన చిత్ర బృందం క్లైమాక్స్ సన్నివేశాల విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేరని, గోండు గిరిజన నేపథ్యంలో ఎంతో భావోద్వేగా భరితంగా పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తీసిన ఈ సినిమా ముగింపు మరింత బలంగా ఉండాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు వినిపిస్తోంది. ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక గొప్ప సినిమా చూశామని అనుభూతితోపాటు బలమైన ఇంపాక్ట్ తో వెళ్లేలా క్లైమాక్స్ తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
also read:Niharika konidela: పట్టు పరికిణిలో సాంప్రదాయంగా ఆకట్టుకున్న మెగా డాటర్!
ఆ అనుభూతి ప్రేక్షకుడికి ఇవ్వాలి..
ఇందుకోసం చిత్రబృందం క్లైమాక్స్ భాగాన్ని మళ్లీ రీ షూట్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి. మైసా సినిమాని కేవలం తెలుగుకే పరిమితం కాకుండా భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలనే ఆలోచనతో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. రష్మికకు దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని మైసా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకే కథలో , సాంకేతిక అంశాలలో కూడా రాజీ పడకూడదని చిత్ర బృందం భావించింది. బాక్సాఫీస్ వద్ద ఇతర పెద్ద సినిమాల పోటీ కూడా లేకపోవడంతో సోలో డేట్ ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
also read:Rajamouli :స్టేజీ పైనే అల్లు అరవింద్ కి రాజమౌళి సలహా..ఇచ్చిపడేశాడుగా..!
మైసా తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందా?
ఇప్పటికే విడుదలైన మైసా(Mysaa Movie) సినిమా టీజర్ , ట్రైలర్ తో పాటుగా విజయశాంతి ఐకానిక్ సాంగ్ ఒసేయ్ రాములమ్మ పాటను కూడా రీమిక్స్ చేసి విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో గతంలో రష్మిక నటించిన సినిమాలలోని పాత్ర కంటే చాలా భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాని హడావిడిగా విడుదల చేసి ఫలితాన్ని దెబ్బ తీసుకోవడం కంటే కొంత సమయం తీసుకుని మరి పక్క అవుట్ పుట్ తో ఈ సినిమాని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు చిత్ర బృందం. మరి వినిపిస్తున్న ప్రకారం క్లైమాక్స్ మార్పులు చేస్తున్నారా లేదా అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాలి. త్వరలోనే మైసా సినిమా విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఏడాది రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ కలిసి నటించిన రణబాలి సినిమా కూడా భారీ విజయాన్ని అందించింది.




