NTR :తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ,నిర్మాతలు క్యూ కడుతుంటారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో చిన్నపాటి గాయం అవ్వడం వల్ల విశ్రాంతి తీసుకొని త్వరలోనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇటువంటి సందర్భంలోనే ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే విషయంపై అభిమానులలో మరోసారి ఆసక్తి నెలకొంది. తాజాగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో ఎన్టీఆర్ నటించబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
జైలర్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ..
ప్రముఖ నిర్మాతలలో ఒకరైన నాగవంశీ నెల్సన్ దిలీప్ కుమార్ ప్రాజెక్టు పైన కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ పైన ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు జూనియర్ ఎన్టీఆర్ ని నెల్సన్ ఎలా చూపించబోతున్నారు? కథలో ఎలాంటి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి ? ఎన్టీఆర్ ఇమేజ్కు తగ్గట్టుగానే యాక్షన్ సీన్ లను పవర్ ఫుల్ గా చూపిస్తారా? లేకపోతే నెల్సన్ తన మార్క్ డార్క్ స్టైలిష్ టేకింగ్ తో ఆకట్టుకుంటారా? అనే విషయంపై అభిమానులు ఆసక్తి పెరిగిపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటివరకు హీరోలను చూపించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా థియేటర్లలో సరికొత్త మాస్ ట్రీట్ చూపించారని చెప్పవచ్చు.. ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే అంచనాలను పెట్టుకున్నారు.
also read:Mamitha Baiju:హీరోయిన్ అంటే నమ్మలేదు.. డైరెక్టర్ పై మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు..!
త్వరలోనే అధికారిక ప్రకటన..
ఇంకా అఫీషియల్ గా అటు ఎన్టీఆర్ నుంచి కానీ, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నుంచి కానీ , ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్(NTR )అయితే డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ నెల్సన్ కూడా తన తదుపరి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారని.. ఈ నేపథ్యంలోని ఎన్టీఆర్ తో సినిమా కోసం ప్రత్యేకించి కథ రాస్తున్నారనే విధంగా వినిపిస్తున్నాయి. మరి పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఉండబోతుందా? లేకపోతే ఎవరూ ఊహించని మలుపులతో డార్క్ కామెడీ యాక్షన్ గా తెరకెక్కిస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.
డ్రాగన్ విడుదల ఎప్పుడంటే?
కథ, సినిమా లాంచింగ్ డేట్, నటీనటుల వ్యవహారం పైన ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది . ఒకవేళ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం తెలుగు, తమిళ ఆడియన్స్ కి మాత్రమే ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అని అభిమానులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్కు మరి స్టైలిష్ నెల్సన్ మేకింగ్ తోడైతే ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ సినిమా పైన భారీగా అంచనాలను పెంచేశాను. ముఖ్యంగా ఎన్టీఆర్ ని చూసి అభిమానులే ఆశ్చర్యపోయేలా ఇందులో కనిపించబోతున్నారు. అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.




