Neha Sharma:ఈ మధ్యకాలంలో తరచూ సినీ సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు ఏఐ సహాయంతో రకరకాల కంటెంట్ సృష్టించడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నటీనటుల ముఖాలను ఉపయోగించి డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను సైతం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలను వైరల్ చేయడం వల్ల చాలా మంది సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల పైన ఇప్పటికే చాలామంది కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటి నేహా శర్మ కూడా ఇదే ఆప్షన్ పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్లు తెలుస్తోంది.
మార్ఫింగ్ ఫోటోలపై రామ్ చరణ్ బ్యూటీ మండిపాటు..
తన అనుమతి లేకుండా ఏ ఐ టెక్నాలజీతో ఫోటోలను, వీడియోలను సృష్టించి వైరల్ చేస్తున్నారని, అలాంటి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తన ఫేస్బుక్ ఉపయోగించి ఏఐ ఇమేజ్ లు వీడియోలను రూపొందించడం ఏమాత్రం సరైనది కాదు అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తన అనుమతి లేకుండా ఇకమీదట ఎవరైనా ఎలాంటి కంటెంట్ సృష్టించినా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అంటూ హెచ్చరించింది. అలాంటి కంటెంట్ వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు కూడా భంగం కలిగే అవకాశం ఉంటుందంటూ హెచ్చరిస్తోంది.
also read:Uday Bhanu:నా భర్త అలాంటి వ్యక్తి.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్ వైరల్!
సహించేది లేదు..
తన ఫోటోలు లేదా ముఖాన్ని పోలిన చిత్రాలతో ఏఐ వీడియోలు ఇమేజ్లు రూపొందించడం వంటివి ఆపివేయాలని, ఇప్పటికే అలాంటి కంటెంట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినవారు తొలగించకపోతే కచ్చితంగా వారి పైన చర్యలు తీసుకుంటామని , తన గుర్తింపును ఉపయోగించి కొత్తగా ఎలాంటి ఏఐ కంటెంట్లు ఎవరు రూపొందించడం కానీ ఎడిట్ చేయడం కానీ ఇతరులకు షేర్ చేయడం వంటివి చేయవద్దు అంటూ హెచ్చరించింది. తన ఫేస్ ఉపయోగించి తప్పుడు విధంగా చిత్రించడం తన ప్రతిష్టకు నష్టం కలిగేలా కంటెంట్ ని ప్రచారం చేయడం వంటివి చేస్తే సహించానంటూ నేహా శర్మ హెచ్చరించింది.
also read:Bigg Boss:బిగ్బాస్ హౌస్లో షాకింగ్ ట్విస్ట్.. షాలినికి బంపర్ ఆఫర్..!
నేహా శర్మ కెరియర్..
బాలీవుడ్లో బోల్డ్ బ్యూటీగా పేరు సంపాదించిన నేహా శర్మ (Neha Sharma)టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడిగా చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత కుర్రాడు అనే చిత్రంలో నటించిన ఈమె.. మళ్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించలేదు. దీంతో టాలీవుడ్ కి దూరమైన ఈ ముద్దుగుమ్.. బాలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలు అందుకుంటూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ గ్లామర్ ఫోటోలని ఇప్పుడు చాలా మంది మిస్ బిహేవ్ చేస్తూ మరింత వైరల్ గా చేస్తున్నారు. మరి మొత్తానికి డీప్ ఫేక్ ఫోటోలు వల్ల తను కూడా ఇబ్బంది పడుతున్నాననే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు కూడా ఈమెకు సపోర్ట్ చేస్తున్నారు.




