Sai Pallavi:బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రామాయణ. ఈ చిత్రాన్ని నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవి పాత్రలో సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, శూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీతిసింగ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమా పైన అంచనాలను పెంచేసింది. హైదరాబాదులో జరిగిన రామాయణ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది . ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొనుంది. అక్కడ యశ్ మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.
నటీనటులపై ఒకరిపై ఒకరు ప్రశంసలు..
యశ్ మాట్లాడుతూ..” రాముడు పాత్రలో ఉండే సింప్లిసిటీ , కంట్రోల్ ను పెర్ఫార్మ్ చేయడం అంత సులువైన పని కాదని, రావణుడి పాత్రను ఎవరైనా చేయగలరేమో కానీ రాముడి పాత్రను పోషించడం అంత సులువు కాదు” అంటూ తెలిపారు. రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. “యశ్ నటించిన కేజిఎఫ్ చిత్రాన్ని చూశాను. అతను కేవలం సూపర్ స్టార్ మాత్రమే కాదని రైటింగ్ మేకింగ్ విషయంలో కూడా మంచి అవగాహన కలిగి ఉంది .ఆయనకు సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉందంటూ” ప్రశంసలు కురిపించారు. రకుల్ ప్రీతిసింగ్ కూడా తన సినీ కెరియర్లో తెలుగు సినీ పరిశ్రమ చాలా కీలకమని తెలియజేసింది. తన సినీ ప్రయాణం ఇక్కడే మొదలయ్యిందని , తన కలలను నెరవేర్చిన ఇండస్ట్రీ కూడా ఇదే అంటూ తెలిపింది
తన పాత్ర పై సాయి పల్లవి కామెంట్..
రామాయణ వంటి గర్వించదగ్గ చిత్రాలలో నటించడం కూడా చాలా ఆనందంగా ఉంది, రణబీర్ రాముడుగా అద్భుతంగా నటించారు అంటూ రకుల్ ప్రీతిసింగ్ ప్రశంసలు కురిపించారు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి చాలా ప్రశాంతంగా కనిపించారు. యశ్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు డైలాగు కూడా అవసరం లేదని స్క్రీన్ ప్రజెన్స్ అంత బలంగా ఉంటుందంటూ తెలియజేశారు. సాయి పల్లవి మాట్లాడుతూ.. సీత పాత్ర పోషించడం తనకు చాలా అదృష్టమని , ఆ పాత్ర ద్వారా తాను ప్రశాంతంగా ఉండడం ఆధ్యాత్మికంగా ఆలోచించడం వంటి విషయాలను ఎక్కువగా నేర్చుకున్నాను అంటూ వెల్లడించింది.
also read:NTR :డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ మూవీ.. ఎవరితో అంటే..?
9 ఏళ్లుగా ప్రయాణం..
అదే సమయంలో స్టేజి పైన హిందీలో రాముడు భజన పాడుతూ పాటలు పాడారు. ఈ చిత్రం కోసం 9 ఏళ్ల పాటూ పనిచేశామని దర్శకుడు నిర్మాత మాత్రం దాదాపుగా పదేళ్లుగా ఈ సినిమా ప్రాజెక్టు కోసం ప్రయాణిస్తున్నారని తెలియజేశారు. సినిమా షూటింగ్ హిందీలో జరుగుతున్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుందని తెలిపారు. తమ పాత్రలను పోషించే సమయంలో ఏ పుస్తకాలు చదవాలో తమకు చిత్ర బృందం సూచించింది అంటు సాయి పల్లవి తెలియజేసింది.
also read:Mamitha Baiju:హీరోయిన్ అంటే నమ్మలేదు.. డైరెక్టర్ పై మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు..!
హీరో పై ప్రశంసలు..
నిర్మాత దిల్ రాజు గురించి సాయి పల్లవి (Sai Pallavi)మాట్లాడుతూ.. ఫిదా సినిమా నుంచి తనని ప్రోత్సహిస్తూ మద్దతిస్తూ ఉన్నారని.. రణబీర్ గురించి మాట్లాడుతూ తన తొలి రోజు షూటింగ్లో ఇంటర్వెల్ సీన్ తీసామని అప్పట్లో తాను టెన్షన్ పడుతూ ఉంటే రణబీర్ చాలా కంఫర్ట్ గా ఉండేలా చూసుకున్నారని తెలిపారు. యశ్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఎక్కడి నుంచి వచ్చాడో తన మూలాలకు సంబంధించిన కథలను చెప్పాలని తపన యశ్ లో కనిపిస్తుందని తెలియజేసింది.




