Anand Deverakonda:టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు సంపాదించిన జంటలలో విజయ్ దేవరకొండ, రష్మిక జంట కూడా ఒకటి.. వీరిద్దరూ వివాహం చేసుకోవడం కూడా ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ వీరి వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా వివాహం కాకముందు ఈ జంట ఎక్కడ కనిపించినా సరే క్షణాలలో ఫోటోలు వైరల్ గా మారేవి. అలా కొన్ని ఏళ్లపాటు ప్రేమించి, ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న ఈ జంట వివాహం తర్వాత కూడా తమ పర్సనల్ లైఫ్ లో బిజీగా ఉన్నారు.
రష్మిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆనంద్ దేవరకొండ..
ఇదంతా ఇలా ఉంటే విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda)తన వదిన (రష్మిక) గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. వివరాలలోకి వెళితే.. బేబీ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా రాబోతున్న మరో చిత్రం ఎపిక్ -ఫస్ట్ సెమిస్టర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యింది . సెప్టెంబర్ 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా ఉన్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను పంచుకున్నారు.
also read:Shalini Pandey:బోల్డ్ వీడియో పై సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్ షాలిని పాండే..!
రష్మికను అందుకే వదినా అని పిలవను..
ఆనంద్ దేవరకొండ తన వదిన రష్మికతో తన బాండింగ్ ఎలా ఉంటుంది? అనే విషయంపై మాట్లాడుతూ..” రష్మిక వరుసకు నాకు వదిన అవుతుంది. కానీ నేను ఆమెను వదిన అని పిలవను . ఎందుకంటే నాకంటే వయసులో చాలా చిన్నది. అందుకే ఆమెను రషి అని పిలుస్తూ ఉంటానని తెలిపారు. రషి చాలా పాజిటివ్, కైండ్ సోల్ అమ్మాయి. చాలా జోవియల్ గా ఉంటుందని ” తన వదిన ఎప్పుడూ అలాగే ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు ఆనంద్ దేవరకొండ. అటు ఈ విషయాన్ని రష్మిక ,విజయ్ దేవరకొండ అభిమానుల సైతం వైరల్ గా చేస్తున్నారు.
also read:Kavya Kalyan Ram:శ్రీదేవి, శ్రియారెడ్డి తర్వాత అదే బాటలో కావ్య కళ్యాణ్ రామ్.. అసలు కథ ఇదే!
విడుదలకు సిద్ధమవుతున్న ఎపిక్..
ఎపిక్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ హవాబ్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు , గ్లింప్స్ సోషల్ మీడియాలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 11న ఈ సినిమా విడుదల కాబోతోంది. బేబీ సినిమా తర్వాత మరొకసారి జంటగా నటించబోతున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యకు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కూడా ప్రేమలో ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు ఈ జంట ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి రాబోయే రోజుల్లో వీటి పైన క్లారిటీ ఇస్తారేమో చూడాలి.




