Bigg Boss 10:సెప్టెంబర్ ఆరవ తేదీన తెలుగు బిగ్ బాస్ సీజన్ 10 చాలా గ్రాండ్ గా ప్రారంభం కానుంది. మరొకసారి నాగార్జున హోస్టుగా వ్యవహరించనున్నారు. అయితే ఈసారి సీజన్ ను దశావతారం కాన్సెప్ట్ తో రూపొందించబోతున్నారు. మొదట పదిమంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశ పెట్టబోతున్నట్లుగా వినిపిస్తున్నాయి. అగ్ని పరీక్ష ద్వారా కొంతమంది వెళ్లబోతున్నారు. అలా మొత్తం మీద పదిమంది హౌస్ లోకి వెళ్తారు. మరి అలా ఎవరు వెళ్తారు అనే విషయంపై ప్రేక్షకులలో ఆసక్తి మొదలయ్యింది. ఈ క్రమంలోనే కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీస్..
తాజాగా వైరల్ గా మారిన న్యూస్ ప్రకారం.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం చైత్ర రాయ్, ముఖేష్ గౌడ, నటుడు కృష్ణుడు, వర్షిణి, టెంపర్ వంశి, జబర్దస్త్ పొట్టి నరేష్, రాంప్రసాద్, మరో నటుడు అదిత్ అరుణ్, దేబ్జాని మోదక్, యూట్యూబర్ సుధీర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ కంటెస్టెంట్స్ పేర్లు అఫీషియల్ గా ఎక్కడ ప్రకటించలేదు బిగ్ బాస్. బిగ్ బాస్ కంటెస్టెంట్ల విషయంలో చివరి వరకు సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది.
also read:Anand Deverakonda:రష్మిక ను ఆనంద్ దేవరకొండ ఏమని పిలుస్తారో తెలుసా..?
అగ్నిపరీక్ష ద్వారా ఎంతమంది?
అలాగే మరొకవైపు అగ్ని పరీక్ష ద్వారా సామాన్యులకు కూడా అవకాశం కల్పించేందుకు బిగ్ బాస్ నిర్వహకులు అగ్నిపరీక్ష పేరుతో వారిలో ఉండే టాలెంట్ ని పరీక్షిస్తున్నారు. దీని ద్వారా కామన్ పీపుల్స్ ని కూడా హౌస్ లోకి పంపించే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీంతో వీరికి సంబంధించి పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.దీంతో సెలబ్రిటీలతో పాటు సామాన్యుల మధ్య గేమ్, ఆ కాంపిటీషన్ కూడా మరింత ఆసక్తిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ 9 సీజన్ ల వరకు పూర్తి చేసుకుంది. మొదట సీజన్లో ఎన్టీఆర్ , రెండవ సీజన్లో నాని హోస్ట్ గా రాగా మూడో సీజన్ నుంచి నాగార్జుననే కొనసాగుతున్నారు.
also read:Shalini Pandey:బోల్డ్ వీడియో పై సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్ షాలిని పాండే..!
సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్..
బిగ్బాస్ తెలుగు 10(Bigg Boss 10) గ్రాండ్ ఓపెనింగ్ కూడా సెప్టెంబర్ 6వ తేదీన సాయంత్రం ఏడు గంటల నుంచి మొదలు కాబోతోంది. మరి అగ్ని పరీక్ష నుంచి ఎంతమంది హౌస్ లోకి వెళ్తారనే విషయం మరో రెండు మూడు రోజులలో తేలనుంది. మరి ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ షో ఎలాంటి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుందో చూడాలి మరి. గతంలో కూడా చాలామంది బిగ్బాస్ షో నిర్వహించకూడదని, ఆపివేయాలంటూ చాలామంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అయినా కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఎక్కడ వెనక్కి తగ్గకుండా అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు.




