Wednesday, September 2, 2026
HomeLATESTShalini Pandey:బోల్డ్ వీడియో పై సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్ షాలిని పాండే..!

Shalini Pandey:బోల్డ్ వీడియో పై సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన హీరోయిన్ షాలిని పాండే..!

Shalini Pandey: ప్రముఖ హీరోయిన్ షాలిని పాండే తాజాగా తన బోల్డ్ వీడియో పై సంచలన స్టేట్మెంట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Shalini Pandey:టాలీవుడ్లో ఎంతోమంది కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ షాలిని పాండే కూడా ఒకరు.. 2017 లో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్గా నటించిన షాలిని పాండే ఓవర్ నైట్ కే భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో షాలిని పాండే నటించిన తీరు, అందం సినిమాకే హైలెట్గా నిలిచింది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118 , ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

వైరల్ గా మారిన షాలిని పాండే బోల్డ్ వీడియో..

అయితే తెలుగులో అర్జున్ రెడ్డి, 118 చిత్రాలు బాగానే పేరు తెచ్చిపెట్టినా.. ఆ తర్వాత నటించిన సినిమాలేవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు చిత్రాలలో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో కుర్రకారులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఎక్కువగా బోల్డ్ షో తోనే సోషల్ మీడియాలో హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. గడిచిన రెండు మూడు రోజుల క్రితం షాలిని పాండే(Shalini Pandey) కి సంబంధించి ఒక బోల్డ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Kavya Kalyan Ram:శ్రీదేవి, శ్రియారెడ్డి తర్వాత అదే బాటలో కావ్య కళ్యాణ్ రామ్.. అసలు కథ ఇదే!

అందులో ఉంది నేను కాదు.. అది ఫేక్..

తాజాగా తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక మార్కింగ్ వీడియో అని, అది ఏ ఐ టెక్నాలజీతో కొంతమంది ఫేక్ వీడియోని సృష్టించారంటూ నటి షాలిని పాండే తన ఇంస్టాగ్రామ్ ద్వారా అధికారికంగా తెలియజేసింది. ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది షాలిని పాండే. ఈ వీడియో పూర్తిగా నకిలీదని, ఏఐ కంటెంట్తో సృష్టించిందే తప్ప అందులో ఉన్నది తాను కాదు అంటూ తెలియజేస్తూ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఇలాంటి టెక్నాలజీ వాడడం చాలా మానసిక క్షోభను కలిగిస్తోందంటూ తెలిపారు. ఇలాంటివి చూసినప్పుడు ఏమాత్రం సహించకూడదని సాధారణ విషయంగా తీసుకోరాదు అంటూ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Rashmi Gautam:జబర్దస్త్‌లోకి తిరిగొచ్చిన సుధీర్.. రష్మి రియాక్షన్‌పై సోషల్ మీడియాలో చర్చ!

అభిమానులకు విజ్ఞప్తి చేసిన హీరోయిన్..

అంతేకాకుండా నెటిజన్స్ కి, అభిమానులకు సూచనలు ఇస్తూ ఇలాంటి ఫేక్ వీడియోలు ఎక్కడ కనిపించిన వాటిని ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దు, డౌన్లోడ్ చేయవద్దు, తప్పుడు కంటెంట్ ను వ్యాప్తి చేయకుండా ఉండండి అంటూ సలహా ఇచ్చింది. ప్రతి ఒకరు బాధ్యతగా పాటించాలని తెలిపింది షాలిని పాండే. గతంలో కూడా చాలామంది సెలబ్రెటీల వీడియోలు ఫోటోలు ఏఐ ద్వారా జనరేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది సెలబ్రెటీలు పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా కోర్టు మెట్లు కూడా ఎక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా డీప్ ఫేక్ బారిన పడ్డ సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you