Saturday, September 5, 2026
HomeLATESTYash:యశ్ టాక్సిక్ సినిమాకి భారీ షాక్!

Yash:యశ్ టాక్సిక్ సినిమాకి భారీ షాక్!

Yash: గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన టాక్సిక్ మూవీకి ఇంగ్లీషులో కూడా షాక్ తగలడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

on
- Advertisement -banner Ad

Yash:కన్నడ హీరో యశ్ తాజాగా నటించిన చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య భారీ క్రేజ్ తో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నెగటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఏకంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. నెగిటివ్ టాక్ ఎక్కువగా రావడంతో కలెక్షన్స్ పైన పెద్ద ప్రభావం చూపించిందని చెప్పవచ్చు.

మరీ ఇంత దారుణమా?

అయితే ఇటీవలే ఇంగ్లీష్ వెర్షన్ ని విడుదల చేయగా.. అక్కడ వచ్చిన స్పందన మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యశ్ టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ వర్షన్ సెప్టెంబర్ 4వ తేదీన ఇండియాలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో రిలీజ్ చేశారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, నోయిడా తదితర నగరాలలో ప్రదర్శించారు. అయితే ట్రేడ్ డేటా ప్రకారం మొదటి రోజు ఇంగ్లీష్ వర్షన్ కి దేశవ్యాప్తంగా 450 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అలా మొదటి రోజు రూ. 1.40 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన యశ్ (Yash) టాక్సిక్ సినిమా కొత్త వర్షన్ కు ఇంత తక్కువ స్పందన రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tellakagitham:టీజర్‌తోనే హిట్ టాక్.. ‘తెల్ల కాగితం’పై ప్రశంసల వర్షం!

ఇంగ్లీషులో కూడా తప్పని నిరాశ..

ముఖ్యంగా నోయిడా, గురుగ్రామ్ వంటి ప్రాంతాలలో మరీ దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రెండు నగరాలలో కలిపి కనీసం 25 టికెట్ల కంటే కూడా ఎక్కువ అమ్ముడైనట్లు కనిపించలేదని ట్రేడ్ రిపోర్ట్ లు తెలుపుతున్నాయి. మిగతా ప్రాంతాలలో పోలిస్తే బెంగళూరు, ముంబై నగరాలలో మాత్రం కాస్త ఆక్యుపెన్సి మెరుగైనట్టుగా కనిపిస్తోందట. అయినప్పటికీ ఇంగ్లీష్ వర్షన్ కి వచ్చిన డిమాండ్ నిర్మాతలు ఆశించిన స్థాయిలో లేదనే విషయం మొదటి రోజే స్పష్టం అవుతుంది. ఇంగ్లీష్ వర్షన్ లో దాదాపుగా 17 నిమిషాల తక్కువ నిడివితో విడుదల చేశారు. అంటే రెండు గంటల 57 నిమిషాలు ఉన్నప్పటికీ మిగతా భాషలలో వర్షన్ దానికంటే ఎక్కువ నిడివితో ఉన్నాయి.

- Advertisement -
Advertisement

also read:OTT Weekend Releases: ఈ వారం ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఇవే!

కనీసం 25 టికెట్లు కూడా అమ్ముడుపోని వైనం..

తాజా ట్రేడ్ ప్రకారం ఇదే పరిస్థితి కొనసాగితే టాక్సిక్ సినిమా ఇంగ్లీష్ వర్షన్ లైఫ్ టైం కలెక్షన్స్ 10 లక్షలు కూడా దాటవని అంచనా వేస్తున్నారు. టాక్సిక్ సినిమా థియేటర్ జర్నీ విషయానికి వస్తే.. ఆగస్టు 26న విడుదలైన టాక్సిక్ సినిమా విడుదలై 10 రోజులు పూర్తి చేసుకునేసరికి.. 331 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.. ఈ సినిమా విడుదలకు ముందే 2000 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబడుతుంది అనుకున్న టాక్సిక్ సినిమా ఈ స్థాయిలో దారుణమైన కలెక్షన్స్ రాబట్టడం అభిమానులలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you