Master Bharath:తెలుగు సినీ ప్రేక్షకులను తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు మాస్టర్ భరత్ గుర్తున్నాడుగా! చిన్న వయసులోనే స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆయన చెప్పే డైలాగులు, పలికించే హావభావాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘రెడీ’, ‘ఢీ’, ‘వెంకీ’ వంటి సినిమాల్లో భరత్ చేసిన కామెడీ ఇప్పటికీ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో సందడి చేస్తూనే ఉంది. అయితే తాజాగా ఆయన సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నారని, నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై తాజాగా భరత్ స్పందించి అసలు విషయం వెల్లడించారు.
80కి పైగా సినిమాల్లో నటించి గుర్తింపు :
మాస్టర్ భరత్(Master Bharath) బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 80కి పైగా సినిమాల్లో నటించి తన కామెడీతో ప్రేక్షకులను అలరించారు. బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి వంటి సీనియర్ నటులతో పాటు పలువురు స్టార్ హీరోలతో కలిసి తెరపై సందడి చేశారు.
ముఖ్యంగా ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’ సినిమాల్లో భరత్ చేసిన కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. చిన్న వయసులోనే తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. 2019లో విడుదలైన ‘ఏబీసీడీ’ సినిమాలో రెండో హీరోగా కూడా కనిపించారు.
also read:Jr NTR:అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్టీఆర్.. నిర్మాత ఎవరో తెలుసా?
డాక్టర్ అయ్యేందుకు సినిమాలకు దూరం? :
అయితే కొంతకాలంగా మాస్టర్ భరత్ సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీంతో ఆయన నటనకు స్వస్తి చెప్పి వైద్య వృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నారనే ప్రచారం మొదలైంది. అంతేకాదు, ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ అయ్యారని, తన తల్లి చివరి కోరికను నెరవేర్చారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చదువుపై దృష్టి పెట్టి చెన్నైలో వైద్య విద్యను పూర్తి చేసినట్లు పలు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఆయన ఇకపై సినిమాల్లో నటించరనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమైంది.
also read:Giribabu:టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత!
నటనకు గుడ్‌బై చెప్పడం లేదు.. భరత్ క్లారిటీ:
తాజాగా తనపై వస్తున్న ప్రచారానికి మాస్టర్ భరత్ స్పష్టతనిచ్చారు. తాను నటనకు గుడ్‌బై చెబుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని వెల్లడించారు. సినిమాలంటే తనకు ఇప్పటికీ ఎంతో ఇష్టమని, మంచి కథలు వచ్చినప్పుడు తప్పకుండా నటిస్తానని స్పష్టం చేశారు.
తనకు నప్పే విభిన్నమైన పాత్రలు, మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. దీంతో భరత్ పూర్తిగా సినిమాలకు దూరమవుతున్నారనే ప్రచారానికి తెరపడింది. మరోవైపు ఆయన తల్లి కమలహాసిని 2025 మే 18న చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 53 సంవత్సరాలు. భరత్‌కు ఆమె ఒక్కరే సంతానం. చిన్నతనంలో ఆయన సినీ ప్రయాణానికి తల్లి ఎంతో ప్రోత్సాహం అందించారు.
మొత్తానికి మంచి పాత్రలు వస్తే మళ్లీ తెరపై కనిపిస్తానని భరత్ ఇచ్చిన క్లారిటీతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి భరత్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తారో చూడాలి…???




