Tiger Shroff:బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పైన ఇటీవల జరిగిన కాల్పుల సంఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీంతో నలుగురిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లుగా సమాచారం. ఈ కేసులో ఒక బాలికను కూడా అదుపులోకి తీసుకొని మరీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన నిందితులలో సుమిత్ సుమిత్ (19), బబిత(23), కునాల్ (21), రాధా (23) గుర్తించారు. వీరందరిని తదుపరి విచారణ కోసం ముంబై పోలీసులకు అప్పగించినట్లుగా తెలుస్తున్నది.
నిందితులు అరెస్ట్..
పోలీసులకు అందిన సమాచారం ప్రకారం.. నిందితులు ఢిల్లీ హర్యానా ప్రాంతంలో ఉండే ఇద్దరు పురుష నిందితుల ఆయుధాలను సేకరించి, మహిళలకు అందించినట్లుగా తెలియజేశారు. అనంతరం ఆయుధాలను తీసుకువెళ్లి ఆ ఇద్దరు మహిళలు ముంబైకి వెళ్లి అక్కడ సిండికేట్ సభ్యులకు అప్పగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. BNSS సెక్షన్ 35 (1) (B) కింద వీరిని కోర్టులో సమర్పించారు. అనంతరం మహారాష్ట్ర పోలీసులు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సైతం ముంబై అధికారులు నిందితులను విచారించడం కోసం కోర్టు అనుమతిని ఆశ్రయించారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో ముంబై పోలీసులు వారిని అధికారికంగా అరెస్టు చేసి మూడు రోజులపాటు ట్రాన్సిస్టర్ రిమాండ్ లో ఉంచారు.
also read:RanaBali 2:రణబాలి2 పై విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!
పక్కా ప్లాన్ ప్రకారమే కాల్పులు..
ఇటీవల జైలు నుంచి బెయిల్ పై బయటికి వచ్చిన కునాల్ కు హర్షాణ గ్రామానికి చెందిన ఒక స్నేహితుడి ద్వారా అనిల్ పండిత్ తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ ఒక యాప్ ద్వారా మాట్లాడుకునే వారని పోలీసులు తెలియజేశారు. అనిల్ పండిత్ సూచనల మేరకు కునాల్ అమృత్సర్ నుంచి ఒక పిస్టల్ ను, 20 బుల్లెట్ ను సేకరించారు. దాదాపుగా రెండు నెలల క్రితమే కునాల్ కు రాధాకు మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. తన కార్యకలాపాల గురించి ఆమెకు వివరించి, ఆయుధంతో ముంబైకి వెళ్లి ఆమెను ఒప్పించినట్లు పోలీసులు తెలియజేశారు. కునాల్, రాధా , బబిత న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి తీసుకువెళ్లి పిస్టల్ రాధా బ్యాగులో ఉంచి.. ప్రయాణ సమయంలో కునాల్ ఎన్క్రిప్టెడ్ యాప్ ద్వారా మెసేజ్లను వీరికి పంపుతూ అలాగే అనిల్ పండిట్ సూచనలను చేరవేసేవారు. ఇదంతా కూడా అక్టోబర్ 15వ తేదీని జరిగింది.
also read:P Susheela:ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. సుశీలమ్మ పాత్రలో ఆ హీరోయిన్?
చాకచక్యంతో పోలీసులు అరెస్ట్..
అక్టోబర్ 17న.. రాధ, బబిత ముంబైలో దాదర్ రైల్వే స్టేషన్ కి చేరుకొని అక్కడ ఒక హోటల్లో ఉన్నట్లుగా తెలిపారు. అక్టోబర్ 18 సాయంత్రం 7 గంటలకు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)కారు పైన కాల్పులు జరిగాయి. షూటర్లు ముంబైలో చిక్కుకుపోయారని కునాల్ కు చెప్పి, వారు అక్కడి నుంచి తప్పించుకునేందుకు ఏర్పాట్లు చేయించారు. అయితే అదే రోజు రాధ, బబిత .. దాదర్ నుంచి హరిద్వార్ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలులో వీరు ఢిల్లీకి బయలుదేరారు.. అక్టోబర్ 20వ తేదీన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో రాధ, బబితలను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అనంతరం సోనీపట్, కునాల్ ను పోలీసులు పట్టుకున్నారు. వీరితో పాటుగా రాజస్థాన్లోని కోటలో మరో ముగ్గురు నిందితులను కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.




