RanaBali 2:టాలీవుడ్ లో స్టార్ కపుల్స్ గా పేరు సంపాదించిన రష్మిక, విజయ్ దేవరకొండ వివాహం తర్వాత నటించిన మొట్టమొదటి చిత్రం రణబాలి. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా దసరా సెలవులు కావడం చేత ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రణబాలి చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కలెక్షన్స్ పరంగా కూడా బాగానే రాబడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దూసుకుపోతున్న రణబాలి..
ఓవర్సీస్ లో కూడా విజయ్ రణబాలి సినిమా బాగానే కలెక్షన్స్ రాబట్టడంతో పాటుగా బుక్ మై షో లో గంటకు కనీసం 10,000 టికెట్ల వరకు బుక్ అవుతున్నాయట. ముఖ్యంగా ఈ సినిమా 1878 కాలంలోని రాయలసీమ ప్రాంతంలో సంభవించినటువంటి కరువు ప్రజల కష్టాలు బ్రిటీష్ పాలకుల ఆగడాలకు సంబంధించిన నేపథ్యంలో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లోనే నిర్మించగా.. హాలీవుడ్ స్టార్ నటుడు ఆర్నాల్డ్ ఓస్లూ ఈ చిత్రంలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే సీనియర్ నటి ఈశ్వరీ రావు కూడా ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించారు.
also read:P Susheela:ఎంఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక.. సుశీలమ్మ పాత్రలో ఆ హీరోయిన్?
రణబాలి సీక్వెల్ కాదు ప్రీక్వెల్..
ఇదంతా ఇలా ఉంటే.. రణబాలి సినిమా మంచి సక్సెస్ అవడంతో ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అనే సందేహాలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ రణబాలి సినిమాకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ ఉంటుందంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రణబాలి సినిమాకి సంబంధించి ప్రీక్వెల్ తెరకెక్కించాలని నాకు చాలా ఆశగా ఉంది. రణబాలి తండ్రి జయమ్మ, గౌడప్పల గత జీవిత కథ ఆధారంగా రణబాలి సినిమా ప్రీక్వెల్ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానని తెలియజేశారు. వారి జీవితాలను రణబాలి విధితో అతను కొడుకు భవిష్యత్తుతోపాటుగా పోర్టు నుంచి తప్పించుకున్న బ్రిటిష్ వ్యక్తి ముద్దు పేరుతో కథ ఉండబోతుందని తెలియజేశారు.
also read:Kajal Aggarwal:టాలీవుడ్‌కు కాజల్ అగర్వాల్ గుడ్‌బై? లైఫ్ లో న్యూ డెసీషన్..!
ఆలస్యమయ్యేనా?
ప్రస్తుతం డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రణబాలి సినిమా ప్రీక్వెల్ (RanaBali 2)వార్తల పైన అటు రష్మిక, విజయ్ అభిమానులు కూడా ఆనంద పడుతున్నారు. కానీ రణబాలి ప్రీక్వెల్ రావాలి అంటే మాత్రం ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ , రష్మిక పలు చిత్రాల కమిట్మెంట్ లో ఉండడం వల్ల ఆ సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా పైన ప్రత్యేక దృష్టి పెట్టెలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఇకమీదట తన సినిమాలకు టికెట్ల రేటు పెంపు ఉండదు అంటూ తేల్చి చెప్పేశారు. అందుకే సినిమా కథల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు విజయ్ దేవరకొండ.




