Friday, October 30, 2026
HomeLATESTAdah Sharma:బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన ఆదాశర్మ!

Adah Sharma:బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన ఆదాశర్మ!

Adah Sharma: ప్రముఖ హీరోయిన్ ఆదాశర్మ తాజాగా తన బ్యూటీ సీక్రెట్సును బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Adah Sharma;తెలుగు, బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ ఆదాశర్మ. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా హెల్త్, లైఫ్ స్టైల్, ఫిట్నెస్ వంటి అంశాలకు సంబంధించిన విషయాల పైన కూడా చిట్కాలను షేర్ చేస్తూ ఉంటుంది ఆదాశర్మ. తాజాగా తన బ్యూటీ సీక్రెట్ ని రివీల్ చేస్తూ ఇంస్టాగ్రామ్ బ్లాక్ లో ఒక వీడియోని పంచుకుంది. ముఖ్యంగా తన మెరిసే చర్మం కోసం తాను రోజు బ్లాక్ మిల్క్ తాగుతున్నట్లు వెల్లడించింది.

బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన ఆదాశర్మ ..

ఆదాశర్మ తన ఇంట్లోనే సింపుల్ గా ఈ బ్లాక్ మిల్క్ తయారు చేసుకునే విధానాన్ని అలాగే దాని వల్ల శరీరానికి కలిగే లాభాలను కూడా అభిమానులతో పంచుకుంది. ఆదాశర్మ షేర్ చేసిన వీడియో ప్రకారం.. ముందుగా ఒక చిన్న పాత్రలో నల్లని నువ్వులను తీసుకొని, వాటిని దోరగా వేయించాలి. ఆ తర్వాత అందులో కొన్ని జీడిపప్పు గింజలు వేసుకొని ఈ రెండిటిని మిక్సీ జార్ లో వేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేసి మెల్లగా నీళ్లు పోస్తూ స్మూతీలా తయారు చేసుకోవాలి.. ఆ తర్వాత వాటిని వడగట్టి అందులో మిగిలిన పిప్పిని కూడా చర్మ సౌందర్యానికి ఉపయోగించుకోవచ్చు .

- Advertisement -
Advertisement

also read:Jayalalithaa:పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ శరత్ బాబు ఎందుకు వెనక్కి తగ్గారంటే?

బ్లాక్ మిల్క్ తో ఇన్ని ఉపయోగాలా?

రోజు బ్లాక్ మిల్క్ తాగడం వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉంటాయంటూ ఆదాశర్మ వెల్లడించింది.. ముఖ్యంగా చర్మం మృదువుగా మారడంతో పాటు మెరిసిపోతూ ఉంటుందని నల్ల నువ్వులతో సహజంగానే పోషకాలు ఉంటాయి. ఇందులో పుష్కలంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు ఖనిజాలు జింక్, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయని తెలియజేసింది. అలాగే జీడిపప్పులో ఉండే మెగ్నీషియం, కాపర్ , సహజ చక్కెర, పీచు ఖనిజాలు వంటివి రోజూ కావలసిన శక్తిని అందిస్తాయంటూ ఆదాశర్మ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే నువ్వులు కానీ జీడిపప్పు కానీ అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిదని తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read:Radhika Apte:బోల్డ్ సీన్స్ పై రాధిక ఆప్టే బయట పెట్టిన నిజాలు..!

ఆదాశర్మ సినిమాలు..

ఆదాశర్మ(Adah Sharma) సినిమాల విషయానికి వస్తే.. 2008లో 1920 అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో హార్ట్ ఎటాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి, గరం, కల్కి, తదితర చిత్రాలలో నటించింది. ది కేరళ స్టోరీ సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.ఇక హిందీలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆదాశర్మ ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు , కన్నడలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో ఈ మధ్యకాలంలో సినిమాలు నటించకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు నటిస్తుందేమో చూడాలి మరి ఆదాశర్మ.

- Advertisement -
Advertisement

 

View this post on Instagram

 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you