Pooja Hegde:టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డేకు ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘బుట్టబొమ్మ’గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ అందాల భామకు ఒకప్పుడు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్లో అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వరుస పరాజయాలు ఆమె కెరీర్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోవాలంటే పూజాకు ఒక బలమైన విజయం అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరుస పరాజయాలతో తగ్గిన క్రేజ్ :
‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న పూజా హెగ్డేకు ఆ తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు. తమిళంలో విజయ్ సరసన నటించిన ‘బీస్ట్’ కూడా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. మరోవైపు బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకపోయింది. ‘హౌస్‌ఫుల్ 4’ మినహా హిందీలో ఆమె నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.
ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మొదటి ఎంపికగా నిలిచిన పూజాకు ఇప్పుడు అవకాశాల విషయంలో పోటీ పెరిగింది. వరుస ఫ్లాపుల కారణంగా ఆమె మార్కెట్, క్రేజ్‌పై కూడా చర్చ జరుగుతోంది. కేవలం గ్లామర్‌తోనే కాకుండా మంచి కథలతో విజయాలు అందుకోవాల్సిన సమయం వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
స్పెషల్ సాంగ్స్, ఇతర భాషా చిత్రాలతో బిజీ :
ఇటీవల రజనీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో పూజా హెగ్డే(Pooja Hegde) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ‘రెట్రో’, ‘జన నాయగన్’ వంటి చిత్రాల్లోనూ భాగమైంది. మరోవైపు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ సినిమాలో గ్లామర్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ ప్రాజెక్టులు ఆమెకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
also read:Adah Sharma:బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన ఆదాశర్మ!
చేతిలో ఉన్న సినిమాలపైనే భారీ ఆశలు :
ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో ‘కాంచన 4’, తెలుగులో ‘శ్రీశ్రీ’ సినిమాలు ఆమె లైనప్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాల విడుదల తేదీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఇక అహాన్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘సంకీ’ సినిమాపై కూడా పూజా భారీ ఆశలు పెట్టుకుంది. 2024లోనే ఈ ప్రాజెక్టుకు ఆమె అంగీకారం తెలిపింది. తొలుత 2025 ప్రేమికుల రోజున విడుదల చేయాలని భావించినప్పటికీ, షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ రోజు నుంచి ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
also read:Jayalalithaa:పెళ్లి చేసుకోవాలనుకున్నాం.. కానీ శరత్ బాబు ఎందుకు వెనక్కి తగ్గారంటే?
టాలీవుడ్లో మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందా? :
ప్రస్తుతం పూజా హెగ్డే కెరీర్‌కు ఒక మంచి హిట్ ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా టాలీవుడ్లో గతంలో సంపాదించుకున్న స్టార్‌డమ్‌ను తిరిగి అందుకోవాలంటే బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుంది. ఆమె చేతిలో ఉన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే మళ్లీ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. మరి పూజా హెగ్డే తన తదుపరి చిత్రాలతో సాలిడ్ కమ్‌బ్యాక్ ఇస్తుందా? వరుస పరాజయాలకు బ్రేక్ వేసి మళ్లీ స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? అనేది వేచి చూడాలి.




