Tuesday, November 10, 2026
HomeLATESTHero suriya:పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

Hero suriya:పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో..!

Hero suriya సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై ఒక స్టార్ కూడా క్లారిటీ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Hero suriya:తమిళ సినీ పరిశ్రమలో హీరోలుగా తమకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న చాలామంది సెలబ్రిటీలు రాజకీయాలలో ప్రవేశించడం కొత్తేమీ కాదు.. గతంలో ఎంజీఆర్, విజయ్ కాంత్, శరత్ కుమార్ వంటి ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి తమదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో అయితే దళపతి విజయ్ ఏకంగా పార్టీ పెట్టిన రెండేళ్లలోపే సీఎం అయ్యి ఒక సంచలనం సృష్టించారు. వీరే కాకుండా హీరో ధనుష్, శివ కార్తికేయన్, సూర్య వంటి హీరోలు కూడా రాజకీయాలలోకి రాబోతున్నట్లు తమిళనాడు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పొలిటికల్ ఎంట్రీ పై సూర్య రియాక్షన్..

అయితే ఈ విషయం పైన ధనుష్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం హీరో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ ఖాయం అనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా హీరో సూర్య(Hero suriya) మాత్రం పొలిటికల్ ఎంట్రీ పైన క్లారిటీ ఇచ్చారు.. తాను నటించిన సీన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజకీయాల గురించి సూర్య పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. తాను కూడా రాజకీయాలలోకి అడుగు పెట్టబోతున్నాననే ఊహాగానాలకు తెరదించారు సూర్య.

- Advertisement -
Advertisement

also read:Renu Desai:పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా పోస్ట్ చేసిన మాజీ భార్య..!

అలాంటి వారే రాజకీయాల్లోకి రావాలి..

అసలు తనకు రాజకీయాలలో ప్రవేశించే ప్రణాళికలే లేవని క్లారిటీ ఇచ్చారు. అయితే తాను రాజకీయ పరిణామాలను మాత్రం చాలా సున్నిహితంగా, నిశ్శబ్దంగానే గమనిస్తూ ఉంటానని తెలియజేశారు. రాజకీయాల పైన పూర్తి అవగాహన, స్పష్టతతో ఉన్న యువత రాజకీయాలలోకి ముందుకు రావాలని సందేశం ఇచ్చారు. హీరో సూర్య దేశంలోని విద్యావ్యవస్థకు, రాజకీయ నాయకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ తన అభిప్రాయంగా వెల్లడించారు. అవినీతిని నిర్మూలించాలని, అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని తన అభిప్రాయంగా తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Pawan Kalyan:పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై టీడీపీ, వైసీపీ కీలక నిర్ణయం.. కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు!

సూర్య సినిమాలు..

సూర్య సినిమాల విషయానికి వస్తే.. భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువా, రెట్రో సినిమాలు సూర్య కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలాయి. కానీ 2026 సంవత్సరంలో మాత్రం సూర్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఏడాది మొదటిలోనే ప్రారంభమైన వీరభద్రుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నది. అలాగే ఆగస్టులో విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇటీవల విడుదలైన సీన్ సినిమా కూడా భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. డైరెక్టర్ జీతూ మాధవన్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. సూర్యకి జోడిగా హీరోయిన్ నజ్రియా నటించింది. ఇందులో విలన్ గా నస్లేన్ అద్భుతమైన పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. ఇందులో సూర్య పోలీస్ ఆఫీసర్గా అదరగొట్టేసారనే విధంగా వినిపిస్తున్నాయి. సూర్య ప్రస్తుతం తన 48వ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you