Tuesday, November 10, 2026
HomeLATESTPawan Kalyan:అన్నా లెజ్నోవాతో బంధానికి పవన్ కళ్యాణ్ గుడ్‌బై.. అసలేం జరిగింది?

Pawan Kalyan:అన్నా లెజ్నోవాతో బంధానికి పవన్ కళ్యాణ్ గుడ్‌బై.. అసలేం జరిగింది?

Pawan Kalyan:పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు విడుదలైన ప్రకటనలో వెల్లడించారు

on
- Advertisement -banner Ad

Pawan Kalyan:జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ కీలక వార్త ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా లెజ్నోవా తమ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు విడుదలైన ప్రకటనలో వెల్లడించారు. ఈ పరిణామం అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. వీళ్లు విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ గుండెలు ముక్కలు అయిపోయిన్నట్లైంది.

పరస్పర అంగీకారంతోనే నిర్ణయం?

తమ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఉద్దేశించి విడుదల చేసిన ప్రకటనలో పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవా తమ నిర్ణయం గురించి వివరించినట్లు పేర్కొంటున్నారు. పరస్పర అవగాహన, గౌరవానికి ప్రాధాన్యం ఇస్తూ వేర్వేరు మార్గాల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. వైవాహిక బంధం ముగిసినా ఒకరిపై మరొకరికి గౌరవం ఉంటుందని, స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగిస్తామని వెల్లడించారు.

- Advertisement -
Advertisement

ముఖ్యంగా తమ పిల్లల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని వారు స్పష్టం సారు. పిల్లల పెంపకం, చదువు, ఎదుగుదలతో పాటు వారి మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తామని, తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను ఇద్దరూ కొనసాగిస్తామని ప్రకటనలో పేర్కోన్నారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హీట్ పెంచేస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Rajinikanth:రజనీకాంత్ జైలర్ 2కు బిగ్ ట్విస్ట్.. వెయ్యి కోట్ల రికార్డుకు బ్రేక్?

తీన్ మార్ సినిమా సమయంలో పరిచయం :

పవన్ కళ్యాణ్( Pawan Kalyan), అన్నా లెజ్నోవా పరిచయం 2011లో విడుదలైన ‘తీన్ మార్’ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడింది. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న వీరిద్దరూ జీవిత భాగస్వాములుగా కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2013 డిసెంబర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి అన్నా లెజ్నోవా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో కీలక భాగంగా మారారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కొన్నేళ్లుగా కలిసి జీవిస్తున్న ఈ జంటకు సంబంధించిన తాజా పరిణామం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
Advertisement

also read:Pooja Hegde:బికినీలో డార్క్ చాక్లెట్ పూజా హెగ్డే.. ఇంటర్నెట్ షేక్ చేస్తున్న బుట్టబొమ్మ!

రాజకీయాల కోసమే విడాకులా?

ఇప్పుడు ఈ పరిణామం వెనుక అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని, దంపతుల మధ్య ఉన్న వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని అంటున్నారు.

అయితే రాజకీయాలపై మరింత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారనే అనే వాదనకు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ఈ పరిణామం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సినీ జీవితంలో కింగ్ గా ఎదిగిన పవన్ రాజకీయాలల్లో లీనం అవ్వడానికి ఇలా విడాకులు తీసుకుంటాడా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు..!!

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you