Pokiri: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం పోకిరి. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును తిరగరాసింది. 2006లో విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే టర్నింగ్ పాయింట్ అయ్యింది. మహేష్ బాబు కి జోడిగా ఇలియానా(ileana) నటించగా.. ఈ చిత్రంతో ఇలియానా ఓవర్ నైట్ కే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ సినిమా ఏకంగా 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ తో పాటు 40 కోట్ల నెట్ కలెక్షన్స్ ని కూడా రాబట్టింది.
రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న పోకిరి..
ఈ సినిమాను ఇప్పటికే ఎన్నోసార్లు రీ రిలీజ్ చేయగా.. కలెక్షన్స్ విషయంలో కూడా భారీగానే రాబట్టింది. ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా , ఈ సినిమాకి సంబంధించి ప్రత్యేకంగా మిడ్ నైట్ షోలను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి థియేటర్లలో పోకిరి సినిమా చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, నాజర్, ఆలీ, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితర నటీనటులు నటించారు.
also read:Fauzi:Most Wanted Since 1932′.. ప్రభాస్ ‘ఫౌజీ’ పోస్టర్‌లో దాగిన అసలు సీక్రెట్ ఇదేనా?
అప్పట్లోనే సంచలన విజయం..
పోకిరి (Pokiri)సినిమా 200కు పైగా కేంద్రాలలో వంద రోజులు ఆడింది, 15 కేంద్రాలలో 200 రోజులపాటు ప్రదర్శించబడిన చిత్రంగా నిలిచింది. 75 ఏళ్ల సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డులు సృష్టించింది పోకిరి చిత్రం. మొదట ఈ సినిమా కథ రాసుకున్నప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మహేష్ బాబుని అనుకోలేదట. మొదట రవితేజను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా కథని సిద్ధం చేయగా.. కొన్ని కారణాల చేత రవితేజతో ఈ సినిమా చేయలేకపోవడంతో మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ మొదలు పెట్టక ముందే సినిమా షూటింగ్ అయిపోగా..ఆ తర్వాత చివరిలో పోకిరి అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.
also read:Vrushakarma:నాగ చైతన్య ‘వృషకర్మ’కు భారీ ఓట్ట్ ఆఫర్..రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ డీల్..!?
పోకిరి సినిమాకి మొదట ఏ టైటిల్ అనుకున్నారంటే?
మొదట పోకిరి సినిమాకి ఉత్తమ్ సింగ్ సన్నాఫ్ సూర్య అనే టైటిల్ ని వాడుకున్నారు. కానీ కొన్ని మార్పులు చేసి పోకిరి అనే టైటిల్ ని పెట్టారు. అలాగే ఇందులో హీరోయిన్ గా మొదట ఆయేషా టాకీయాను సంప్రదించారట. అన్ని ఓకే అనుకున్నాక కొన్ని కారణాల చేత ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకోకపోవడం, కంగనా రనౌత్ ను ఎంపిక చేయడం , ఆమె కూడా హ్యాండ్ ఇవ్వడంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఊర మాస్ గెటప్ లో తొలిసారి కనిపించిన మహేష్ బాబు..
ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారిగా ఊర మాస్ గెటప్ లో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు. అతడు సినిమా తర్వాత, సుమారుగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని తన మేకోవర్ ను మార్చుకున్నారు. ఇప్పటివరకు రీ రిలీజ్ కలెక్షన్స్ లో కూడా సరి కొత్త రికార్డు సృష్టించిన పోకిరి సినిమా మరి ఈసారి ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.




