Sunday, November 1, 2026
HomeLATESTJailer 2 OTT:రజనీకాంత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జైలర్ 2 ఓటీటిలో సీన్స్ యాడ్..!

Jailer 2 OTT:రజనీకాంత్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. జైలర్ 2 ఓటీటిలో సీన్స్ యాడ్..!

Jailer 2 OTT: రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ 2 ఓటిటి వెర్షన్ లో 30 నిమిషాలు అదనంగా యాడ్ చేయబోతున్నట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Jailer 2 OTT:సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ సినిమా ఎలాంటి రికార్డులను తిరగా రాసి ఉంటే చెప్పాల్సిన పనిలేదు.. జైలర్ సినిమాకి సీక్వెల్ గా జైలర్ 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 800 కోట్ల రూపాయలు కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది.ఇప్పటికే చాలా చోట్ల తమిళనాడులో రజనీకాంత్ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

జైలర్ సినిమా ఓటీటీ వెర్షన్ లో 30 నిమిషాల సీన్ యాడ్..

ఇటువంటి సందర్భంలోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి(Jailer 2 OTT) సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో నవంబర్ 12 నుంచి జైలర్ 2 సినిమా ఓటీటి లోకి రాబోతున్నట్లు వినిపిస్తున్నాయి. తెలుగు ,తమిళ్ భాషలలోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఒకేసారి ఈ సినిమాని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ నుంచి అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా జైలర్ 2 ఓటిటి వెర్షన్ లో 30 నిమిషాలు ఎక్స్ట్రా ఫుటేజ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:RC 17:గ్రాండ్ గా RC 17 పూజా కార్యక్రమం లాంఛ్ చేసిన చిరంజీవి!

150 కోట్లకు పైగా ఓటీటీ డీల్..

సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో రమ్యకృష్ణ ,విద్యాబాలన్, శివరాజ్ కుమార్, హృతిక్ రోషన్, విజయ్ సేతుపతి, మిధున్ చక్రవర్తి తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర కూడా సినిమా విజయానికి కీలకమని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకి సంగీతాన్ని అందించిన అనిరుధ్ సంగీతమే ఈ సినిమాకు మరింత ప్లస్ గా మారింది. జైలర్ 2 సుమారుగా 150 కోట్లకు పైగా ఓటిటి డీల్ కుదిరినట్లుగా తెలుస్తోంది. జైలర్ 3 కూడా ఉండబోతోంది అంటూ చివరిలో చిన్నపాటి హింట్ ఇచ్చారు చిత్ర బృందం.

- Advertisement -
Advertisement

also read:Bigg Boss Telugu 10:అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..శివాజీ గురించి కౌశల్ షాకింగ్ కామెంట్స్..

రజనీకాంత్ తదుపరి చిత్రాలు..

ప్రస్తుతం రజనీకాంత్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ధర్మన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్వత్ మారిమత్తు దర్శకత్వం వహిస్తుండగా ఇందులో నయనతార, సిమ్రాన్, రాశి ఖన్నా, శ్రీలీల ,హీరో రామ్ పోతినేని, యోగిబాబు తదితర నటీనటులు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే కమలహాసన్, రజినీకాంత్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా కూడా రాబోతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you