OG:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టార్ యాక్షన్ రామ “ఓజి” థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఓటీటీలోను మంచి ఆదరణ పొందింది ఈ సినిమా. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ మూవీ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలోను మంచి వ్యూవర్ షిప్ నమోదు చేసుకోవడంతో టెలివిజన్ ప్రీమియర్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈటీవీ సొంతం చేసుకున్న శాటిలైట్ హక్కులు :
తాజాగా ఓజి(OG) చిత్రానికి సంబంధించిన శాటిలైట్ ప్రసార హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ “ఈటీవీ” అధికారికంగా సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన భారీ యాక్షన్ చిత్రాన్ని ఈటీవీ దక్కించుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. త్వరలోనే ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో ప్రసారం కాబోతుంది. అయితే ప్రసార తేదీని ఛానల్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ALSO READ:Jananayagan:ఇంకొన్ని గంటల్లో “జన నాయగన్” రిలీజ్.. పూజా హెగ్డేకు ఊహించని షాక్..!
28 ఏళ్ల తర్వాత ఈటీవీలో పవన్ సినిమా :
పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఈటీవీలో ప్రసారం కావడం దాదాపు 28 ఏళ్ల తర్వాత జరగడం విశేషం. గతంలో విడుదలైన “సుస్వాగతం” తర్వాత ఈటీవీ ప్రసార హక్కులు దక్కించుకున్న పవన్ కళ్యాణ్ చిత్రం “ఓజీ” కావడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. దీంతో ఈ ప్రీమియర్ కి మంచి స్పందన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి
ALSO READ:Meher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం!
టిఆర్పి రికార్డులపై అంచనాలు :
థియేటర్లు, ఓటీటీలో ఇప్పటికే మంచి విజయాన్ని నమోదు చేసిన ఓజీ ఇప్పుడు టెలివిజన్లో కూడా అదే జోరుని కొనసాగిస్తుందని సినీవర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ఉన్న విపరీతమైన అభిమాన వర్గం కారణంగా ఈ సినిమా ప్రసారానికి భారీ టిఆర్పి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈటీవీ కూడా ఈ ప్రీమియర్ ని ప్రత్యేక కార్యక్రమంగా ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతుంది. దీంతో ఓజి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




