Thursday, September 10, 2026
HomeLATESTSardar 2 Movie Review:సర్దార్ 2 మూవీ రివ్యూ: కార్తీ స్పై యాక్షన్ ఎలా ఉంది?

Sardar 2 Movie Review:సర్దార్ 2 మూవీ రివ్యూ: కార్తీ స్పై యాక్షన్ ఎలా ఉంది?

Sardar 2 Movie Review:కార్తీ హీరోగా నటించిన సర్దార్ 2 పూర్తి మూవీ రివ్యూ తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Sardar 2 Movie Review:తమిళ హీరో కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమాకు తెలుగు, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో కార్తీ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు నాలుగేళ్ల తర్వాత ‘సర్దార్ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 10న వరల్డ్‌వైడ్‌గా విడుదలైన ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేక్షకులకు అందించింది. మరి ఈ సీక్వెల్ ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా..? అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం..!

కథ :

‘సర్దార్ 2’లో(Sardar 2 Movie Review) మరోసారి కార్తీ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారు. స్పై మిషన్, దేశ భద్రత, యాంటీబయాటిక్స్ దుర్వినియోగం వంటి అంశాలను కథలో మిళితం చేశారు. సమాజానికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన సందేశాన్ని యాక్షన్ కథతో చెప్పే ప్రయత్నం చేశారు. కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుడు వెంటనే మెయిన్ ప్లాట్‌లోకి వెళ్లిపోతాడు. అయితే కథ ముందుకు సాగే కొద్దీ దర్శకుడు ఎంచుకున్న ట్రీట్‌మెంట్ కొంత అతిగా అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు, ట్విస్టులు లాజిక్‌కు దూరంగా ఉండటం మైనస్‌గా మారింది.

- Advertisement -
Advertisement

also read:RanaBali :వైరల్ గా మారిన రణబాలి టీజర్!

విశ్లేషణ :

దర్శకుడు పి.ఎస్. మిత్రన్ మంచి కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. స్పై థ్రిల్లర్‌కు సామాజిక సందేశాన్ని జోడించడం ఆసక్తికరంగా ఉంది. ఫస్టాఫ్‌లో కథను ఎక్కువగా పక్కదారి పట్టించకుండా నేరుగా తీసుకెళ్లడం ప్లస్ పాయింట్. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

- Advertisement -
Advertisement

అయితే సెకండాఫ్‌లో కథనం బలహీనపడుతుంది. కొన్ని సన్నివేశాలు మరీ సినిమాటిక్‌గా, నమ్మశక్యం కాని విధంగా అనిపిస్తాయి. దాదాపు మూడు గంటల నిడివి కూడా కొన్ని సందర్భాల్లో భారంగా అనిపిస్తుంది. మంచి సందేశం ఉన్నప్పటికీ దాన్ని మరింత బలమైన స్క్రీన్‌ప్లేతో చెప్పి ఉంటే సినిమా స్థాయి మరోలా ఉండేది.

also read:Balakrishna:బాలయ్య -కొరటాల శివ షూటింగ్ మొదలు అప్పుడే..!

- Advertisement -
Advertisement

నటీనటుల పర్ఫామెన్స్ :

కార్తీ తన రెండు పాత్రల్లోనూ మంచి వేరియేషన్ చూపించారు. యాక్షన్ సన్నివేశాల్లోనూ, భావోద్వేగ సన్నివేశాల్లోనూ తన అనుభవాన్ని ప్రదర్శించారు. ఈ సినిమాలో ప్రధాన బలం కార్తీ నటనేమాళవిక మోహనన్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. తన పాత్రకు తగ్గట్టుగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ తమ పరిధిలో ఆకట్టుకున్నారు. ఎస్.జే. సూర్య లాంటి నటుడు విలన్‌గా ఉన్నప్పటికీ, ఆయన పాత్రకు తగినంత బలం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యోగిబాబు తన పాత్రలో కనిపించినంత మేరకు అలరిస్తారు.

టెక్నికల్ టీమ్ :

సామ్ సీఎస్ అందించిన సంగీతం సినిమాకు ఆశించిన స్థాయిలో బలం ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలకు మంచి లుక్ తీసుకొచ్చింది.

విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో షార్ప్‌గా అనిపించినా, ఓవరాల్‌గా నిడివిని మరింత తగ్గించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలుగుతుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్, విజువల్ ప్రెజెంటేషన్ ఆకట్టుకుంటాయి. అయితే విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల నాసిరకంగా అనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్ :

*కార్తీ ద్విపాత్రాభినయం

*ఆసక్తికరమైన స్పై కాన్సెప్ట్

*ఫస్టాఫ్‌లో వేగంగా సాగే కథనం

*ఇంటర్వెల్ బ్యాంగ్

*యాంటీబయాటిక్స్‌పై ఇచ్చిన సామాజిక సందేశం

*కొన్ని యాక్షన్ సన్నివేశాలు

*నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

*లాజిక్‌కు దూరంగా అనిపించే సన్నివేశాలు

*సెకండాఫ్‌లో బలహీనమైన కథనం

*ఎక్కువ నిడివి

*కొన్ని అతిగా అనిపించే యాక్షన్ సన్నివేశాలు

*బలహీనమైన విలన్ పాత్ర

*ఆశించిన స్థాయిలో లేని సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

*కొన్ని చోట్ల నాసిరకంగా అనిపించే VFX

*కొన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యం లేకపోవడం

పంచ్ లైన్ : కార్తీ పెర్ఫార్మెన్స్, ఆసక్తికరమైన కాన్సెప్ట్ ఉన్నా.. లాజిక్ లేని యాక్షన్, సాగదీత కథనం ‘సర్దార్ 2’పై ఆసక్తిని తగ్గిస్తాయి.

రేటింగ్ : 2.5/5

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you