Thursday, September 10, 2026
HomeLATESTAnchor Bhanu sri:వారిని నమ్మి 20 లక్షలు మోసపోయిన యాంకర్..!

Anchor Bhanu sri:వారిని నమ్మి 20 లక్షలు మోసపోయిన యాంకర్..!

Anchor bhanu sri: యాంకర్ భాను శ్రీ ఒకరిని నమ్మి ఏకంగా 20 లక్షలు మోసపోయాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

Anchor Bhanu sri:ఒకప్పుడు యాంకర్ గా, చిత్రాలలో నటిగా నటించిన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటులలో భాను శ్రీ కూడా ఒకరు. బుల్లితెరపై పలు షోలలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ..బిగ్బాస్ లో కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఆర్థిక మోసం గురించి ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఒక వ్యక్తిని తాను గుడ్డిగా నమ్మి 20 లక్షల రూపాయల వరకు నష్టపోయానంటూ పంచుకుంది.

ఒకరిని నమ్మి 20 లక్షలు మోసపోయాను…

భానుశ్రీ మాట్లాడుతూ.. మొదట రెండు సంవత్సరాల పాటు ఆ వ్యక్తి ప్రతినెల మూడు శాతం వడ్డీని తన బ్యాంకు ఖాతాలో జమ చేశారని, వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండడంతో ఆ వ్యక్తి పైన తనకు నమ్మకం పెరిగిందని అలా రెండు సంవత్సరాల తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినప్పుడు ఆ వ్యక్తి డబ్బు ఇవ్వలేవని , అది తమ వద్ద లేదంటూ చెప్పినట్లు తెలిపింది భాను శ్రీ.. అయితే ఆ విషయం విన్న తర్వాత తన ఆశ్చర్యపోయి డబ్బు ఎందుకు ఇవ్వలేనట్టు అని ప్రశ్నించగా? వారు మాకు ఇవ్వలేమంటే ఇవ్వలేము అంతే అంటూ సమాధానం చెప్పారని తెలిపారు. తన దగ్గర తీసుకున్న డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టారని అయితే అందులో అది కోల్పోయిందంటూ ఆ వ్యక్తి చెప్పారని భానుశ్రీ తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:Sardar 2 Movie Review:సర్దార్ 2 మూవీ రివ్యూ: కార్తీ స్పై యాక్షన్ ఎలా ఉంది?

డబ్బులు ఇవ్వమని అడిగితే.. బెదిరించారు..

భాను శ్రీ (Anchor Bhanu sri)ఆ వ్యక్తికి నగదు రూపంలో 20 లక్షల రూపాయలు ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తికి డబ్బు ఇచ్చినట్లుగా ఎలాంటి రుజువు లేదని ఆ వ్యక్తి వాదించారట. నువ్వు ఎక్కడ ఇచ్చావు మాకు డబ్బులు? నాకు ఇవ్వలేదు ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించమని వారు రివర్స్ తిరగడంతో తాను చాలా ఆవేదనకు లోనయ్యానని తెలిపింది. భాను శ్రీ కొత్త ఇంటిని కొనుగోలు చేయాలని ఆశతో ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ అప్పట్లో 50 లక్షలు రూపాయలకు ఒక ఫ్లాట్ వస్తుందని తాను 20 లక్షల రూపాయలు ఇచ్చి మిగిలిన 30 లక్షలు ఇఎంఐ పద్ధతిలో తీసుకోవాలని భావించినట్లు చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement

also read:RanaBali :వైరల్ గా మారిన రణబాలి టీజర్!

కర్మ ఎవరినీ వదిలిపెట్టదు..

అయితే ఆ మొత్తాన్ని సమకూర్చడానికి తన వద్ద 12 లక్షలతో పాటు తన తల్లికి చెందిన ఒక చిన్న భూమిని కూడా అమ్మేశానని తెలిపింది. చివరికి తాను నమ్మి ఇచ్చిన ఆ వ్యక్తి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి.. పోలీస్ కేసు పెట్టుకుంటే పెట్టుకోండి అంటూ బెదిరించారని భాను శ్రీ గుర్తుచేసింది. ఈ ఘటన తన జీవితంలో మానసికంగా ఆర్థికంగా చాలా దెబ్బతీసిందని తెలిపింది. ఇక అప్పటి నుంచి తాను దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నానని, తనను మోసం చేసిన వారు ఇప్పటికీ రోడ్డు మీదే ఉన్నారని కర్మ తిరిగి వారిని బాధిస్తుంది అంటూ చెప్పుకొచ్చింది భాను శ్రీ.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you