Ram Kapoor:నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న లాకప్ సీజన్ 2 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేస్తోంది. షో నిబంధనల ప్రకారం కంటెస్టెంట్లు తమ జీవితాల్లో జరిగిన ఎవరితోనూ పంచుకోని విషయాలను వెల్లడించాల్సి వస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సంచలన విషయాలు చెప్పగా, తాజాగా ప్రముఖ హిందీ నటుడు రామ్ కపూర్(Ram Kapoor) చేసిన వ్యాఖ్యలు అందరినీ భావోద్వేగానికి గురిచేశాయి.
బుల్లితెర నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణం:
రామ్ కపూర్ హిందీ టెలివిజన్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. న్యాయ్ సీరియల్‌తో కెరీర్ ప్రారంభించిన ఆయన ఘర్ ఏక్ మందిర్, కసం సే, రిష్తే వంటి సీరియల్స్‌లో నటించి కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యారు. అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఏజెంట్ వినోద్, తప్పడ్, ది బిగ్ బుల్, జాలీ ఎల్‌ఎల్‌బీ 3 తదితర చిత్రాల్లోనూ నటించి అభిమానులను సంపాదించుకున్నారు. సహనటి గౌతమీ గడ్గిల్‌ను 2003లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
13 ఏళ్ల వయసులో ఎదురైన చేదు అనుభవం:
షోలో భాగంగా తన జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనను రామ్ కపూర్ పంచుకున్నారు. తాను ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో హాస్టల్‌లో ఒక సీనియర్ విద్యార్థి తనను అనుచితంగా తాకాడని వెల్లడించారు. ఆ ఘటన జరిగినప్పుడు డార్మిటరీలో మరికొందరు విద్యార్థులు ఉన్నప్పటికీ, భయంతో ఏమీ చేయలేకపోయానని తెలిపారు. కొంతసేపటి తర్వాత ధైర్యం చేసి తనకు అలాంటి ప్రవర్తన ఇష్టం లేదని చెప్పడంతో ఆ విద్యార్థి అక్కడి నుంచి వెళ్లిపోయాడని వివరించారు.
ALSO READ:P Susheela:ఎస్. జానకి మృతిపై సుశీల ఎమోషనల్ ఫైర్..”ఇప్పుడు కళ్లు చల్లబడ్డాయా..?”
40 ఏళ్లుగా దాచిన నిజం:
ఆ సంఘటన తనపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని రామ్ కపూర్ చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆ విద్యార్థి క్షమాపణ చెప్పడంతో ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయాయని వెల్లడించారు. ఈ విషయాన్ని నాలుగు దశాబ్దాలుగా తల్లిదండ్రులు, పిల్లలతో కూడా పంచుకోలేదని, కేవలం తన భార్య గౌతమికి మాత్రమే చెప్పానని తెలిపారు. భవిష్యత్తులో ఏ చిన్నారికీ ఇలాంటి అనుభవం ఎదురుకాకూడదని ఆయన ఆకాంక్షించారు.
ALSO READ:Niharika:షర్టు బటన్స్ విప్పి మరీ సెగలు పుట్టిస్తున్న మెగా డాటర్!
భావోద్వేగానికి గురైన కంటెస్టెంట్లు:
రామ్ కపూర్ స్టోరీ విన్న తర్వాత హౌస్‌లోని పలువురు కంటెస్టెంట్లు కన్నీటి పర్యంతమయ్యారు. పోస్ట్ ఫర్ ఖాన్ ఆయనను ఓదార్చగా, రితేష్ దేశ్‌ముఖ్ ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు. ఇది ఇలా ఉండగా, షోలో ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కాగా, మరికొందరు డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నారు.




