Wednesday, July 15, 2026
HomeLATESTP Susheela:ఎస్. జానకి మృతిపై సుశీల ఎమోషనల్ ఫైర్.."ఇప్పుడు కళ్లు చల్లబడ్డాయా..?"

P Susheela:ఎస్. జానకి మృతిపై సుశీల ఎమోషనల్ ఫైర్..”ఇప్పుడు కళ్లు చల్లబడ్డాయా..?”

P Susheela:భారతీయ సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసిన ఎస్. జానకి మరణంపై ప్రముఖ గాయని పి. సుశీల తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.

on
- Advertisement -banner Ad

P Susheela:ప్రముఖ సింగర్ ఎస్. జానకి అకస్మిక మరణం సంగీత ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆమె మరణ వార్తతో అభిమానులతో పాటు సినీ, సంగీత రంగ ప్రముఖులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దశాబ్దాల పాటు భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేసిన జానకి ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని పి. సుశీల(P Susheela) భావోద్వేగంగా స్పందించారు. జానకిని తలుచుకుంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. “జానకమ్మ(S Janaki) ఒక వ్యక్తి కాదు.. సంగీతానికి ప్రతీక. ఆమె లేని సంగీత ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. సరస్వతి దేవి తన దివ్య సంగీత సభ కోసం జానకమ్మను తన వద్దకు పిలిపించుకుందని అనిపిస్తుంది” అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారు:

తమ కెరీర్ ప్రారంభం నుంచి ఇద్దరినీ ప్రత్యర్థులుగా చూపించే ప్రయత్నాలు జరిగాయని పి. సుశీల వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే జానకి గురించి తన వద్ద, తన గురించి జానకి వద్ద అసత్యాలు చెప్పి అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించారని తెలిపారు. అలాంటి కుట్రల వల్ల కొంత మానసిక వేదన ఎదురైనా, తమ మధ్య ఉన్న పరస్పర గౌరవం, ఆప్యాయత ఎప్పుడూ తగ్గలేదని స్పష్టం చేశారు. “ఆ రోజుల్లో తమ స్నేహాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించిన వారు ఇప్పుడు ఏం సాధించారో వారికే తెలుసు” అని సుశీల వ్యాఖ్యానించారు. నిజమైన అనుబంధాన్ని ఎలాంటి కుట్రలు కూడా దెబ్బతీయలేవని ఆమె అన్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Niharika:షర్టు బటన్స్ విప్పి మరీ సెగలు పుట్టిస్తున్న మెగా డాటర్!

పాటల రూపంలో జానకి చిరంజీవి:

జానకి వంటి మహోన్నత గాయని స్వరాన్ని వినే అదృష్టం దక్కిన ప్రతి ఒక్కరూ నిజంగా అదృష్టవంతులేనని పి. సుశీల పేర్కొన్నారు. భౌతికంగా జానకి మన మధ్య లేకపోయినా, ఆమె ఆలపించిన వేలాది అమర గీతాల ద్వారా ఎప్పటికీ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆమె స్వరం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భారతీయ సంగీత చరిత్రలో జానకి పేరు ఎప్పటికీ చెరగని అక్షరాలతో నిలిచిపోతుందని సుశీల భావోద్వేగంగా నివాళులర్పించారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Samantha:ఓటీటీలోకి వచ్చేస్తున్న సమంత యాక్షన్ మూవీ!

జానకి వ్యక్తిగత విషయానికి వస్తే..

సింగర్ జానకి తన 60 సంవత్సరాల  సినీ జీవితంలో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వంటి భాషలలో సుమారుగా 50వేలకు పైగా పాటలు పాడింది. ఉత్తమ గాయనిగా నాలుగు జాతీయ పురస్కారాలను అందుకోగా, 31 సార్లు రాష్ట్రాల నుంచి పురస్కారాలను అందుకుంది. జానకి వి. రాంప్రసాద్ ను వివాహం చేసుకొని చెన్నైలో స్థిరపడింది. ఆయన 1990లో మరణించారు. అయితే వీరికి మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు. మురళీకృష్ణ నటుడు గానే కాకుండా భరతనాట్యంలో కూడా మంచి ప్రావీణ్యం కలవారు. ఈయన ఈ ఏడాది జనవరి 22న మరణించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you