Wednesday, July 15, 2026
HomeLATESTKorean kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్..

Korean kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ రిలీజ్..

Korean kanakaraju: వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొరియన్ కనకరాజు మూవీ నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

on
- Advertisement -banner Ad

Korean kanakaraju: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా నటిస్తున్న విభిన్నమైన చిత్రం కొరియన్ కనకరాజు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా రితికా నాయక్ నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ ని పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ఈ టీజర్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినట్లు కనిపిస్తోంది.

కొరియన్ కనకరాజు నుండి టీజర్ రిలీజ్..

టీజర్ విషయానికి వస్తే.. పెనుగొండ నుండి కొరియా వరకు సాగే స్టోరీ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ మాస్ పాత్రతో పాటు ,గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. టీజర్ లో కామెడీతో పాటుగా యాక్షన్ ఎమోషనల్ హర్రర్ సీన్స్ అన్నీ కూడా చూపించారు. ముఖ్యంగా కమెడియన్ సత్య, హీరో వరుణ్ తేజ్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ టీజర్ కే హైలెట్గా నిలిచాయి. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టీజర్ కి మరింత హైలెట్గా మారింది. టీజర్ లో కనిపించిన విజువల్స్ , వరుణ్ తేజ్ మేకోవర్ కొరియా బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

- Advertisement -
Advertisement

ALSO READ:Ram Kapoor:13 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులు.. షాకింగ్ నిజం బయటపెట్టిన టీవీ నటుడు రామ్ కపూర్!

ఆగస్టు 7న రిలీజ్..

కొరియన్ కనకరాజు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి టీజర్ కి వచ్చిన స్పందన చూస్తూ ఉంటే ట్రైలర్తో మరింత హైప్ వచ్చేలా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేకుండా సతమతమవుతున్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు సినిమా కచ్చితంగా హిట్ ఇచ్చేలా కనిపిస్తోందని అభిమానులు సైతం భావిస్తున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా విభిన్నంగా కనిపించబోతున్నారు.

- Advertisement -
Advertisement

ALSO READ:P Susheela:ఎస్. జానకి మృతిపై సుశీల ఎమోషనల్ ఫైర్..”ఇప్పుడు కళ్లు చల్లబడ్డాయా..?”

మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు..

వరుణ్ తేజ్ నటిస్తున్న మరో సినిమా బరి. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని 2023లో వివాహం చేసుకోగా.. వీరికి 2025 లో ఒక కుమారుడు జన్మించారు. అటు వివాహం అనంతరం లావణ్య త్రిపాఠి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you