Nayanthara: టాలీవుడ్ కోలీవుడ్లో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నయనతార చాలా తక్కువగా తన సినిమా ప్రమోషన్స్లో పాల్గొంటూ ఉంటుంది. చిరంజీవితో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా కి గాను ప్రమోషన్స్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తాజాగా హీరో యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా నయనతార నటించింది. నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులో చాలా ఘనంగా జరిగింది. అక్కడికి కూడా నయనతార రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
యశ్ కోసం రూల్స్ పక్కన పెట్టిన నయనతార..
ఇప్పటివరకు టాక్సిక్ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల విడిచిన ట్రైలర్ అన్ని అంచనాలను మార్చేసిందని చెప్పవచ్చు. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్, మాఫియా ప్రపంచాన్ని చూపించిన విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదంతా ఇలా ఉంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నయనతార హాజరు కావడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. సాధారణంగా నయనతార సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం తన రూల్స్ ని బ్రేక్ చేసి మరి బెంగళూరులో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైంది.
రూల్స్ బ్రేక్ చేయడంపై నయనతార రియాక్షన్..
అసలు నయనతార ఈవెంట్ కి ఎందుకు వచ్చింది? యశ్ కు ఆమెకు ఉన్న అనుబంధం ఏంటి? అనే విషయాలపైన క్లారిటీగా చెప్పింది నయనతార. ప్రమోషన్స్ కి నయనతార దూరంగా ఉంటుందని అయితే టాక్సిక్ విషయంలో మాత్రం ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈవెంట్లో ఇదే విషయాన్ని యాంకర్ నయనతారనే ఈ విషయం పైన ప్రశ్నించింది? ఈ విషయం పైన నయనతార మాట్లాడుతూ.. ప్రచార కార్యక్రమాలు తనకు ఇష్టం లేక కాదని, వాటికి తాను అంతగా అలవాటు పడకపోవడం వల్లే తాను దూరంగా ఉంటున్నానని వివరించింది.
also read; వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్..!
యశ్ వల్లే వచ్చానంటూ..
కానీ తనకు టాక్సిక్ సినిమా చాలా ప్రత్యేకమైన ప్రాజెక్ట్ అంటూ తెలియజేసింది నయనతార. యశ్ తనకు ఫోన్ చేయడం ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణం అని తెలియజేసింది. యశ్ ఒక్క ఫోన్ కాల్ చేయడం వల్ల బెంగళూరుకి వచ్చేందుకు అంగీకరించానని.. యశ్ పైన నాకు ఉన్న గౌరవం సినిమా పట్ల ఉన్న నమ్మకం ఈ నిర్ణయం వెనుక ఉన్నట్లు నయనతార స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ విజన్ పై కూడా నయనతార ప్రశంసలు కురిపించారు. సృజనాత్మక ఆలోచనలతో తెరకెక్కిస్తున్న ప్రాజెక్టులను తాను ఎప్పుడూ కూడా మద్దతు ఇస్తూనే ఉంటానని తెలియజేసింది నయనతార. టాక్సిక్ సినిమా విజయంలో కూడా దర్శకురాలి ఆలోచనను సైతం తాను అర్థం చేసుకున్నానని తెలియజేసింది.




