Monday, August 31, 2026
HomeLATESTVijay Deverakonda:"అలా చేయకపోతే నేను బ్రతికి వేస్ట్"..స్టేజీ పై విజయ్ దేవరకొండ ఎమోషనల్..!

Vijay Deverakonda:”అలా చేయకపోతే నేను బ్రతికి వేస్ట్”..స్టేజీ పై విజయ్ దేవరకొండ ఎమోషనల్..!

Vijay Deverakonda:‘రోమాంచకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ పాల్గొని ఆసక్తికరంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

on
- Advertisement -banner Ad

Vijay Deverakonda:‘రోమాంచకం’.. ఈ సినిమా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ చూసినా సరే ‘రోమాంచకం’ సినిమాను ప్రమోట్ చేస్తున్న దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక జనాలు అయితే ఈ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలా ఈ సినిమా క్యూరియాసిటీ పెంచేసింది.

సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సునీల్ కుమార్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణీత్ ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్‌కి రెడీ అయింది.

- Advertisement -
Advertisement

‘రోమాంచకం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ:

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ వచ్చారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండకి, అదేవిధంగా సందీప్ రెడ్డి వంగకి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ రేంజ్ ఇప్పుడు ఈ విధంగా ఉంది అంటే దానికి పరోక్షంగా కారణం సందీప్ రెడ్డి వంగా. ఆయన తెరకెక్కించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే ఆయన ఫేమ్ ఇంతలా పెరిగిపోయింది. ఇందులో నో డౌట్.

also read:OTT Movies : ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.. లిస్ట్ ఇదే!

- Advertisement -
Advertisement

‘అర్జున్ రెడ్డి’ రోజులను గుర్తు చేసుకున్న విజయ్:

ఈ విషయాన్ని స్టేజ్‌పై మరోసారి గుర్తు చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. తనదైన స్పీచ్‌తో యువతను ఆకట్టుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సమయంలో వాళ్లు పడిన బాధ, డబ్బులు ఏ విధంగా అరేంజ్ చేశారన్న విషయాలను ఓపెన్‌గా స్టేజ్‌పై చెప్పారు. డబ్బులు లేకపోయేసరికి సందీప్, ప్రణయ్, ప్రభాకర్ అంకుల్ వాళ్లు పొలాలు అమ్మి సినిమా తీశారు అని ఆ రోజులను గుర్తు చేసుకొని బాధపడ్డారు. సినిమా సాధించిన విజయం కంటే ఆ సినిమా షూటింగ్ సమయంలో గడిపిన క్షణాలనే మేము ఎక్కువగా మిస్ అవుతూ ఉంటాము అని విజయ్ తెలిపారు.

also read:Korean Kanakaraju:వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్.. OTTలోకి హారర్ కామెడీ మూవీ..!

- Advertisement -
Advertisement

సందీప్ రెడ్డి వంగపై విజయ్ ఎమోషనల్ స్పీచ్ :

అంతేకాదు, సందీప్ రెడ్డి వంగా ఎప్పుడు ఏ ఫంక్షన్‌కి పిలిచినా సరే కచ్చితంగా వస్తా. ఒకవేళ రాలేకపోయినా.. నేను బతికి వేస్ట్. నా జీవితం ఇప్పుడు ఇలా ఉంది అంటే దానికి కారణం సందీప్ రెడ్డి వంగనే అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. భద్రకాళి పిక్చర్స్ లోగో ఎప్పుడు తెరపై పడినా సరే వెంటనే నాకు ‘అర్జున్ రెడ్డి’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గుర్తొస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ని ప్రతి ఒక్కరికి ఈ భద్రకాళి పిక్చర్స్ లోగో గుర్తుచేస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

కష్టపడితే సక్సెస్ తప్పకుండా వస్తుంది :

అంతేకాదు యువతకు ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. మన కళ్లల్లో ఆశయం, గుండెల్లో కసి ఉంటే మనం అనుకున్న విజయం ఖచ్చితంగా సాధిస్తాం. అది ఎప్పటికైనా సరే.. అది ఆరు నెలలు పట్టొచ్చు, ఏడాది పట్టొచ్చు, రెండేళ్లు అవ్వచ్చు, ఐదేళ్లు అవ్వచ్చు. కచ్చితంగా కష్టపడి పని చేస్తే సక్సెస్ అనేది వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే అక్కడుండే ఆడియన్స్ చప్పట్లు కొట్టి, అరుపులు, కేకలతో రచ్చ రంబోలా చేశారు.

‘రోమాంచకం’పై విజయ్ దేవరకొండ వెరైటీ ఆన్సర్ :

అంతేకాదు, యాంకర్ అడిగిన క్వశ్చన్‌కి వెరైటీ సమాధానం ఇచ్చి అందరి మనసులను తాకాడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). ‘మీ జీవితంలో రోమాంచకం కలిగించిన క్షణాల గురించి చెప్పండి’ అని యాంకర్ అడగ్గా తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చాడు విజయ్. ‘పుట్టినప్పటి నుంచి డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్రేకప్ పైన, బ్లెండర్స్ ప్రైడ్ తాగిన.. ఏదైనా సరే అది నాకు రోమాంచకమే’ అంటూ సరదాగా నవ్వించారు. ఈ సినిమాను థియేటర్‌లో చూసి కచ్చితంగా ఎంకరేజ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ స్పీచ్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you