Thursday, July 23, 2026
HomeLATESTMeher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం!

Meher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం!

Mehar Ramesh: ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట తాజాగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మరణం తీరని లోటు అంటూ మెహర్ రమేష్ కన్నీటి పర్యంతమయ్యారు.

on
- Advertisement -banner Ad

Meher Ramesh:టాలీవుడ్ లో విభిన్నమైన దర్శకుడిగా పేరు సంపాదించిన మెహర్ రమేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు మెహర్ రమేష్. అలాంటి మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంటల క్రితం మెహర్ రమేష్ చిన్నక్క జ్యోతి సుంకర సోమవారం రాత్రి విజయవాడలో తుదిశ్వాస విడిచారు. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యూమోనియాతో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈ విషయాన్ని మెహర్ రమేష్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు.

రమేష్ ఇంట తీవ్ర విషాదం..

తన సోదరితో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. ఒక పోస్టును షేర్ చేశారు మెహర్ రమేష్ . దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు సైతం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. “చిన్నప్పటి నుంచి తనని ఎంతో ప్రోత్సహిస్తూ.. ఒక తల్లి లాగా అండగా ఉన్న అక్క ఇటీవలే తన కుమార్తె వివాహాన్ని చాలా దగ్గరుండి వైభవంగా జరిపించిందని, కొన్ని రోజుల క్రితమే తామందరం కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము. చాలా ఆనందంగా గడిపాము.. తన జీవితంలో అత్యంత కీలకమైన వ్యక్తి తన అక్క ఇంత త్వరగా తమను వదిలి వెళ్లిపోవడం తనకు తీరని లోటు “అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు మెహర్ రమేష్.

- Advertisement -
Advertisement

also read:Nidhhi Agerwal: వైట్ లెహంగాలో హీట్ పుట్టిస్తున్న నిధి అగర్వాల్!

కన్నీటి పర్యంతమవుతున్న డైరెక్టర్..

తన అక్క లేదనే నిజాలను తమ కుటుంబం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుందని తెలియజేశారు. మెహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఎన్నో చిత్రాలు తెరకెక్కించిన పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. 2004లో వీర కన్నడిగ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెహర్ రమేష్.. 2008లో ఎన్టీఆర్ తో కంత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బిల్లా, శక్తి, షాడో, భోళా శంకర్ వంటి చిత్రాలను తెరకెక్కించారు. అయితే ఇందులో బిల్లా సినిమా మెహర్ రమేష్ కి మంచి క్రేజీ తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Toxic:టాక్సిక్ నుంచి మరో సాంగ్ రిలీజ్.. మొత్తం రొమాన్స్..!

నటుడిగా యూటర్న్..

మెహర్ రమేష్(Meher Ramesh) ఇప్పుడు యాక్టింగ్ వైపుగా వెళ్లారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. కథ డిమాండ్ మేరకు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. బాబీ చిత్రం తర్వాత మళ్లీ వెండితెర పైన మెహర్ రమేష్ కనిపించబోతున్నారు. మరి ఈసారి రీఎంట్రీలో యాక్టింగ్ పరంగా డైరెక్టర్ మెహర్ రమేష్ కి కలిసొస్తుందేమో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/p/DbEPHN5ymPa/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you