Thursday, July 23, 2026
HomeLATESTJananayagan:ఇంకొన్ని గంటల్లో "జన నాయగన్‌" రిలీజ్.. పూజా హెగ్డేకు ఊహించని షాక్..!

Jananayagan:ఇంకొన్ని గంటల్లో “జన నాయగన్‌” రిలీజ్.. పూజా హెగ్డేకు ఊహించని షాక్..!

Jananayagan:'జన నాయగన్' విడుదలకు ముందు దర్శకుడు హెచ్. వినోద్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పూజా హెగ్డే పాత్రపై ఆయన చేసిన కామెంట్లు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Jananayagan:తమిళ స్టార్ దళపతి విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “జన నాయగన్‌”(Jananayagan). ఈ సినిమా జూలై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయింది. రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత విజయ నటించిన తొలి సినిమా ఇదే కావడంతో పాటు ఆయన సినీ కెరియర్లో చివరి చిత్రంగా ప్రచారం జరుగుతూ ఉండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలకు ముందే దర్శకుడు హెచ్. వినోద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి

భగవంత్ కేసరి తో పోలికపై వివరణ:

ఈ సినిమా తెలుగులో విజయవంతమైన “భగవంత్ కేసరి” కథ ఆధారంగా తెరకెక్కిందని వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై స్పందించిన దర్శకుడు హెచ్. వినోద్ ఆ కథ ప్రభావం కొంతవరకు ఉన్న విషయాన్ని అంగీకరించారు. అయితే ఇది పూర్తిస్థాయి రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ భాగంలో సుమారు 60 శాతం.. రెండో భాగంలో 20 శాతం వరకు మాత్రమే మూల కథ ప్రభావం కనిపిస్తుందని.. మొత్తంగా సగం వరకు మాత్రమే ఆ కథను అనుసరించినట్లు తెలిపారు మిగతా భాగాన్ని పూర్తిగా కొత్త అంశాలతో రూపొందించినట్లు వెల్లడించారు.

- Advertisement -
Advertisement

also read:Meher Ramesh: డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట విషాదం!

పూజ హెగ్డే పాత్రపై దర్శకుడు వ్యాఖ్యలు:

సినిమాలో హీరోయిన్ పూజ హెగ్డే( Pooja Hegde) పాత్ర గురించే ప్రస్తుతం ఎక్కువగా చర్చ జరుగుతుంది. “భగవంత్ కేసరి”లో కాజల్ అగర్వాల్ పోషించిన డాక్టర్ పాత్రకు భిన్నంగా జననాయగన్ లో పూజా హెగ్డే జర్నలిస్టుగా కనిపించబోతుందని వినోద్ తెలిపారు. విజయ్ తో ఆమెకు ఎలాంటి రొమాంటిక్ ట్రాక్ ఉండదని ప్రేక్షకులు ఊహించినంత స్క్రీన్ టైమ్ కూడా ఆమె పాత్రకు ఉండదు అని చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Nidhhi Agerwal: వైట్ లెహంగాలో హీట్ పుట్టిస్తున్న నిధి అగర్వాల్!

నిడివి కారణంగా తగ్గిన పాత్ర:

మొదట స్క్రిప్ట్ లో పూజ హెగ్డే పాత్రకు మరిన్ని కీలక సన్నివేశాలు రాసిన.. సినిమా నిడివి ఎక్కువ కావడంతో వాటిలో చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింది అంటూ దర్శకుడు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆమె పాత్ర పరిమితమైందని దీనిపై పూజ హెగ్డే ఒక వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పామని తెలిపారు. విజయ్ నటన , రాజకీయ నేపథ్యం, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you