Thursday, August 13, 2026
HomeMOVIE NEWSMokshagna:నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?

Mokshagna:నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్?

Mokshagna:నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పాన్ ఇండియా డైరెక్టర్ని రంగంలోకి దింపినట్లు సమాచారం.

on
- Advertisement -banner Ad

Mokshagna:టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna)ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీ హీరోగా మారారు. అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపైన ఇప్పటివరకు సరైన స్పష్టత మాత్రం కనిపించడం లేదు. ఈ విషయం పైన అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. గతంలో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ (Mokshagna)ఎంట్రీ ఉంటుందంటూ ప్రకటించారు. అందుకు సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేయగా.. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందనే విధంగా వార్తలు కూడా వినిపించాయి.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్య తిప్పలు..

ఈ విషయం అటు బాలయ్య అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది? డైరెక్టర్ ఎవరు? ఎలాంటి కథతో వస్తారు? అనే విషయం పైన ఇప్పటికే చాలాసార్లు పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. మోక్షజ్ఞ ఎంట్రీ విషయంపై బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. నందమూరి బ్రాండ్ కు తగ్గట్టుగానే ఒక పవర్ఫుల్ స్టోరీ సిద్ధం చేశారని, అందుకు సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించి.. అర్జున్ రెడ్డి , యానిమల్ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Rashmika mandanna:అలాంటి అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక!

రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..

ఇందుకు సంబంధించి పనులు అయితే జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా సందీప్ రెడ్డివంగా సినిమాలలో హీరోలకు ఉండే ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఎమోషనల్ సీన్ పరంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సందీప్ రెడ్డి వంగ ఎంట్రీ తో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండబోతుందని చెప్పవచ్చు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ విషయం పైన అధికారికంగా చిత్ర బృందం ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun:హమ్మయ్య.. బన్నీ నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసిన లోకేష్.. థ్యాంక్స్ బ్రో..!

ఆ డైరెక్టర్ స్పందిస్తారా?

ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాత్రం ప్రభాస్ తో కలిసి స్పిరిట్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా సగభాగం పూర్తయింది. సందీప్ రెడ్డి వంగ అలాగే యానిమల్ 2 సినిమాని కూడా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఎంట్రీ పైన డైరెక్టర్ సందీప్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you