Sunday, October 11, 2026
HomeLATESTGarividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్.. ఎవరెవరంటే

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి సినిమాని రిజెక్ట్ చేసిన నలుగురు హీరోయిన్స్.. ఎవరెవరంటే

Garividi Lakshmi: ఆనంది ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గరివిడి లక్ష్మి మూవీ ని ఏకంగా నలుగురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు.

on
- Advertisement -banner Ad

Garividi Lakshmi:ఏ సినీ పరిశ్రమలోనైనా సరే ఒక కథను ఎంతో మంది సెలబ్రిటీల దగ్గరకు తీసుకెళ్లి చెప్పడం సర్వసాధారణ. అలా ఎంతోమంది రిజెక్ట్ చేసినా..ఎవరో ఒకరు ఒప్పుకొని.. అందులో నటించి మంచి విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాలలో ఫ్లాపులైన సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఏదైనా సినిమా కథ సెట్స్ పైకి వెళ్లడానికి ఎన్నో మలుపులు తిరుగుతాయని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఒకరి జీవిత కథ బయోపిక్ ఆధారంగా తెరకెక్కించాలంటే నటీనటులకు కత్తి మీద సామే అని చెప్పవచ్చు. నటనలో కానీ డైలాగుల్లో కానీ మరే ఇతర విషయాలలోనైనా సరే తేడా వచ్చినా.. కెరియర్ పైన భారీగా ఎఫెక్ట్ పడుతుందనే భయం చాలామందికి వెంటాడుతుంది.

తన వద్దకు కథ ఎలా వచ్చింది అనే విషయంపై స్పందించిన ఆనంది..

ఇప్పుడు అలాంటి ఒక సవాల్ తో కూడిన పాత్ర చుట్టూ తిరిగిన సినిమా విషయంపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలయ్యింది. కోలీవుడ్, టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలోనైనా సరే మెప్పించగలిగే హీరోయిన్స్లలో నిత్యమీనన్ కూడా ఒకరు. నిత్యామీనన్ తో పాటుగా పలువురు టాప్ హీరోయిన్స్ కూడా వదిలేసిన చిత్రం గరివిడి లక్ష్మి. ఈ సినిమా ఒక పవర్ఫుల్ బయోపిక్ చివరికి హీరోయిన్ ఆనంది వద్దకు ఎలా వచ్చింది అనే విషయం పైన తాజాగా ఆనంది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గరివిడి లక్ష్మి సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.

- Advertisement -
Advertisement

స్టార్ హీరోయిన్స్ అంతా రిజెక్ట్ చేశారు..

గరివిడి లక్ష్మి(Garividi Lakshmi) బయోపిక్ స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే మేకర్స్ ఇండస్ట్రీలో ఉండే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ని సంప్రదించామని అన్నారు.. నిత్యామీనన్ తో సహా మరో నలుగురైదుగురు హీరోయిన్స్ కి సైతం ఈ సినిమా కథను వినిపించారని, అందులో కొంతమందికి లుక్ టెస్ట్, వర్క్ షాప్ వంటివి నిర్వహించారు. కానీ ఆ పాత్ర డిమాండ్ చేసే భావోద్వేగాలు అసలైన వ్యక్తిత్వాన్ని తెరపైన చూపించే విషయంలో ఎదురయ్యే రిస్క్ ను చూసి చాలామంది ముందుకు రాలేకపోయారని వెల్లడించారు. అంతటి చాలెంజింగ్ కలిగి ఉన్న ఈ పాత్రను ఒప్పుకోవడానికి స్టార్ హీరోయిన్స్ కూడా వెనుకడుగు వేశారని, దీంతో మేకర్స్ కూడా సందిగ్ధంలో పడిపోయారు. అందరూ చేతులెత్తేసిన తర్వాత ఈ కథ డెబ్యూ డైరెక్టర్ ద్వారా తన టేబుల్ దగ్గరికి వచ్చిందని తెలిపింది ఆనంది.

also read:Suma Kanakala:రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చూస్తే సుమ రియాక్షన్ ఇదే!

- Advertisement -
Advertisement

వెనుకడుగు వేసిన వారికి నా నటనే సమాధానం..

డైరెక్టర్ దాదాపు మూడున్నర గంట పాటు కథను పూస గుచ్చినట్లుగా వివరించారని , ఆ కథ విన్నంత సేపు తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఒక కళాకారిణి జీవితంలో ఇన్ని ఇబ్బందులు , ఇంతటి పోరాటం ,సమాజం నుంచి ఎదురైన కష్టాలు ఉంటాయా అని చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చింది. కేవలం సినిమా కథ విన్నప్పుడే గుండె బరువెక్కించిన ఆ జీవితాన్ని ఎలాగైనా సరే తెరపైకి తీసుకురావాలని ఆరోజు నిర్ణయించుకున్నాను. స్టార్ హీరోయిన్స్ వద్దనుకున్నా సరే తాను రిస్కు చేయాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నాను.. ఎవరైతే ఈ సినిమా కోసం వెనకడుగు వేశారో.. వారికి సమాధానం చెప్పేలా ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయాలనే కసితో ఈ సినిమా ఛాలెంజ్ని స్వీకరించాను అంటూ ఆనంది చెప్పుకొచ్చింది.

also read:Yash:యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ డైరెక్టర్ సినిమా.. టాలీవుడ్‌లో హాట్ టాపిక్!

- Advertisement -
Advertisement

గరివిడి లక్ష్మి తో ఆనంది సాధిస్తుందా?

స్టార్ హీరోయిన్స్ సైతం చేయలేకపోయినా ఈ బయోపిక్ తో ఆనంది వెండితెర పైన ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి మరి. ఆనంది 2012లో వచ్చిన ఈ రోజుల్లో సినిమాల ఒక పాత్రలో నటించి ఆ తర్వాత బస్ స్టాప్ సినిమాలో కూడా నటించి మంచి విజయాలను అందుకుంది. అలా చిన్న చిన్న సినిమాలలో కూడా నటించిన ఆనంది పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించి మెప్పించింది. మరి గరివిడి లక్ష్మి సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది..మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you