Tuesday, November 24, 2026
HomeLATESTTFJA: సినీ జర్నలిస్ట్ దేవిప్రియకు బిగ్ షాక్.. మళ్లీ వేటు!

TFJA: సినీ జర్నలిస్ట్ దేవిప్రియకు బిగ్ షాక్.. మళ్లీ వేటు!

TFJA: TFJA తాజాగా ఒక లేఖ ను విడుదల చేస్తూ సినీ జర్నలిస్ట్ దేవి ప్రియకు భారీ షాక్ కలిగించింది. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

TFJA: తెలుగు సినీ పరిశ్రమలో తాజాగా ఒక సంచలన విషయం వైరల్ గా మారింది. అదేమిటంటే సీనియర్ జర్నలిస్ట్ వేదుల సూర్యనారాయణ మూర్తి (దేవి ప్రియ) ఎన్నో ఇంటర్వ్యూలు చేస్తూ ఎన్నో ప్రశ్నలకు సెలబ్రిటీల నుంచి సమాధానాలను రప్పిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు అలాంటి జర్నలిస్టుపై తెలుగు సినిమా పరిశ్రమ కఠినమైన నిర్ణయం తీసుకుంది.. వేదుల మూర్తికి ఎటువంటి సినీ సెలబ్రిటీలు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, సినిమా ప్రమోషన్స్, విడుదల కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించకూడదు అంటూ TFJA ఎగ్జిక్యూటివ్ బాడీ స్పష్టం చేస్తూ ఒక లేఖను విడుదల చేసింది.

ఇకపై సినిమా ఇంటర్వ్యూలకు పిలవకండి..

నవంబర్ 23వ తేదీన తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, చిత్ర బృంద సభ్యులందరికీ కూడా ఈ లేఖను విడుదల చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలలో ఆయనకు భాగస్వామ్యం కల్పించవద్దు అంటూ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయానికి పూర్తిస్థాయిలో సహకరించాలి అంటూ ఆ నోటీసులో విజ్ఞప్తి చేశారు.. ఈ విషయాన్ని TFJA అధ్యక్షుడు వైద్య రాంబాబు, ప్రధాన కార్యదర్శి పి రఘు, లక్ష్మీనారాయణ సంతకాలతో కూడిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆయన పైన ఆంక్షలు విధించడానికి గల కారణాలను మాత్రం TFJA తన ప్రకటనలో ఎక్కడా వెల్లడించలేదు.

- Advertisement -
Advertisement

also read:Faria Abdullah: పరికిణిలో గ్లామర్ తో కట్టిపడేస్తున్న ఫరియా అబ్దుల్లా!

మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్న వేదుల మూర్తి..

నిజానికి వేదుల మూర్తి వివాదాలలో చిక్కుకోవడం ఇదేమి మొదటిసారి కాదు.. గతంలో కూడా తన వృత్తిపరమైన ప్రవర్తన, సోషల్ మీడియా వ్యాఖ్యలు, సెలబ్రిటీల ఇంటర్వ్యూల విషయంలో కూడా ఎన్నోసార్లు ఆయన క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్నారు.. 2024 డిసెంబర్లో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి తో చేసిన వివాదాస్పదమైన ఇంటర్వ్యూతో పాటుగా సంఘ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో TFJA సుమారుగా ఆరు మాసాలపాటు సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పడంతో తిరిగి మళ్ళీ సంఘంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Shruti Haasan:పెద్ది స్పెషల్ సాంగ్ పై.. శృతిహాసన్ దిమ్మతిరిగే సమాధానం..!

సెలబ్రిటీల ఆగ్రహానికి కారణం..

2026 మార్చి నెలలో కూడా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని తన సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలకు మూడు నెలల పాటు సస్పెన్షన్ పడింది. ఆ సమయంలో సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా రాతలు రాస్తున్నారంటూ కూడా TFJA సైతం తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని తెలియజేశారు. దీంతో కొంతమంది దర్శకులు ఈ జర్నలిస్టు పైన శాశ్వత నిషేధం విధించాలంటూ డిమాండ్ కూడా చేశారు. కేవలం పాపులారిటీ వ్యూస్ కోసమే నటీనటులను ఇబ్బంది పెట్టేలా కొన్ని ద్వంద అర్థాల ప్రశ్నలు కూడా వేస్తున్నారని గతంలో మంచు లక్ష్మి కూడా ఫిర్యాదు చేసింది. ఇలా ఎన్నో వివాదాలు ఉన్న నేపథ్యంలో వేదుల మూర్తికి తాజా ఇంటర్వ్యూలు నిలిపివేయాలంటూ TFJA ఆదేశాలను జారీ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you