Wednesday, November 25, 2026
HomeLATESTDimple Hayathi:డింపుల్ హయాతికి స్టేజ్ పైన లవ్ యు చెప్పిన హీరో..!

Dimple Hayathi:డింపుల్ హయాతికి స్టేజ్ పైన లవ్ యు చెప్పిన హీరో..!

Dimple Hayathi: గ్లామర్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న డింపుల్ హయతికి ఒక స్టార్ హీరో స్టేజ్ పైనే లవ్ యు చెప్పడం వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Dimple Hayathi:టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ , హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం భోగి. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించగా.. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాజాగా నిర్వహించిన భోగి సినిమా మ్యూజికల్ నైట్ లో గంగా పాటని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో శర్వానంద్ మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమా పైన భారీగా అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు.

డింపుల్ హయతిపై ప్రశంసలు కురిపించిన శర్వానంద్..

గతంలో ఎన్నడూ లేని విధంగా హీరో శర్వానంద్ భోగి సినిమాలో డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే మరొక హీరోయిన్ డింపుల్ హయాతి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. దీంతో ఈ సినిమా గురించి మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు. తాజాగా డింపుల్ హయాతి గురించి స్టేజ్ పైన హీరో శర్వానంద్ చేసిన కామెంట్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి.. శర్వానంద్ మాట్లాడుతూ డింపుల్ లవ్ యు ఆల్వేస్! అంటూ అందరి ముందు ఓపెన్ గా చెప్పేయడంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు.

- Advertisement -
Advertisement

also read:Jr NTR:రణబీర్ కపూర్ కోసం అనుకున్న టైటిల్.. చివరకు ఎన్టీఆర్ సినిమాకు ఫిక్స్!

ఆమె ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్..

డింపుల్ హయాతి(Dimple Hayathi) గురించి మాట్లాడుతూ .. ఆమె చూస్తే ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. తను సెట్ లో రాగానే చుట్టుపక్కల ఏదో ఒక అద్భుతం క్రియేట్ అవుతుందని, అందరిని ఎంతో కంఫర్టబుల్గా ఉంచుతుంది.. ఆ అమ్మాయిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఎలా తీసుకోవాలి అనే విషయం నేను కూడా నేర్చుకోవాలి అంటూ డింపుల్ హయాతీపైన ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే మరొక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి కూడా మాట్లాడుతూ ఈ సినిమాలో నాది అనుపమాది చాలా అద్భుతమైన లవ్ స్టోరీ.. 15 ,20 ఏళ్లలో నేనైతే ఇలాంటి ప్రేమ కథను చూడలేదు అంటూ తెలియజేశారు.

- Advertisement -
Advertisement

also read:Tharun Bhascker:నన్ను తక్కువగా అంచనా వేస్తే ఊరుకోను.. తరుణ్ భాస్కర్ మాస్ వార్నింగ్!

37 సినిమాల కోసం పడిన కష్టం ఈ ఒక్క సినిమా కోసమే..

భోగి సినిమాలో పైకి లవ్ స్టోరీ గా కనిపించదు కానీ అండర్ కంటెంట్ సంపత్తు దాన్ని రాసిన తీరు చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఈ సినిమా కోసం తాను పడ్డ శ్రమ.. గురించి శర్వానంద్ చెబుతూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తాను ఇప్పటివరకు 37 చిత్రాలలో నటించాను. ఆ 37 సినిమాలను కలిపి ఎంత కష్టపడ్డానో కేవలం ఈ భోగి సినిమా కోసం అంత ఎక్కువ కష్టపడ్డాను అని ఇది బ్లడ్ ఫెస్టా లేక బ్లడ్ పోసుకున్నారా అనే విషయం నాకు తెలియదు కానీ.. అమ్మవారి సాక్షిగా చెబుతున్న ఈ సినిమా కోసం నిజంగా బ్లడ్ పెట్టి పని చేశాను ఒక యాక్షన్ హీరో అవ్వాలి అంటే ఒక యాక్షన్స్ స్క్రిప్ట్ చేయాలి అంటే ఇంత కష్టపడ్డాలా అంటూ ఫస్ట్ టైం నేర్చుకున్నానని తెలిపారు. మొదట తాను ఈ పాత్రను చేయగలనా అనే సందేహం వచ్చినప్పటికీ తనను నమ్మి ఈ పాత్ర ఇచ్చిన వ్యక్తి డైరెక్టర్ సంపత్ నందికి కృతజ్ఞతలు తెలియజేశారు శర్వానంద్.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you