Monday, October 19, 2026
HomeLATESTTiger Shroff:టైగర్ ష్రాఫ్ పై తుపాకీతో కాల్పులు.. వారి పనేనా..?

Tiger Shroff:టైగర్ ష్రాఫ్ పై తుపాకీతో కాల్పులు.. వారి పనేనా..?

Tiger Shroff: ప్రముఖ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

on
- Advertisement -banner Ad

Tiger Shroff:బాలీవుడ్ లో యాక్షన్ హీరోగా పేరు సంపాదించిన టైగర్ ష్రాఫ్ గడిచిన కొన్ని గంటల క్రితం ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు.. ముంబైలోని జూహూ ప్రాంతంలో ఆయన ప్రయాణిస్తున్న కారు పైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల ఘటన ఒక్కసారిగా బాలీవుడ్ పరిశ్రమలోనే కలకలం రేపింది. ఈ ఘటనతో టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడగా.. ఆయన డ్రైవర్ గాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హీరో ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయం గురించి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

టైగర్ ష్రాఫ్ కారుపై దుండగులు కాల్పులు..

పోలీసుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం ఫుడ్ బాల్ ఆడి ఇంటికి తిరిగి వస్తున్న టైగర్ ష్రాఫ్ కారును లక్ష్యంగా చేసుకొని కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు పైన మూడు రౌండ్లు కాల్పులు జరపడం తో అక్కడి ప్రాంతంలో ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు టైగర్ ష్రాఫ్(Tiger Shroff) కు తుపాకీ కాల్పులలో ఎటువంటి గాయాలు కాలేదు. ఈ విషయాన్ని ఆయన తండ్రి జాకీ ష్రాఫ్ కూడా అధికారికంగా ధ్రువీకరించారు. మరొకవైపు గాయపడిన డ్రైవర్ని ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించి మరి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Rashmika Mandanna:బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. వైరల్ అవుతున్న వీడియోలు!

రంగంలోకి 12 ప్రత్యేక పోలీస్ బృందాలు..

పోలీసులు కూడా ఈ వ్యవహారం పైన తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలో తీసుకున్నారని నిందితులను పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా చేసుకొని ఇందుకు కాల్పులు జరిపారు అనే విషయం పైన విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈ కాల్పులకు తామే బాధ్యులం అంటూ.. అనిల్ పండిట్, హెర్మన్ సంధు అనే ఇద్దరు వ్యక్తులు ఈ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి.. అంతేకాకుండా వీరు లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ కి చెందిన వారు అన్నట్టుగా పలు కథనాలు కూడా వెలువడుతున్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రం ఇంకా అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

- Advertisement -
Advertisement

also read:Naga Vamsi:ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్‌పై సస్పెన్స్‌కు తెర.. ఎప్పుడంటే?

రంగంలోకి మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి..

ఈ ఘటన అనంతరం మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్, టైగర్ ష్రాఫ్ కుటుంబంతో మాట్లాడినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ హీరో ఆరోగ్యం సురక్షితంగా ఉందని తెలియడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫోటో విషయానికి వస్తే.. టైగర్ ష్రాఫ్ చేతికి పెద్ద కట్టుతో అక్కడక్కడ గాయాలు తగిలినట్లుగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన టైగర్ ష్రాఫ్ ఫ్యామిలీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారా చూడాలి మరి. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీలు ఎవరూ కూడా ఈ విషయంపైన స్పందించలేదు మరి ఇకమీదటైనా స్పందిస్తారేమో చూడాలి మరి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you