Vishwak sen:టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కల్ట్. ఈ సినిమా టీజర్ విడుదల చేసినప్పటి నుంచే సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా విడుదలైన కల్ట్ ట్రైలర్ చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా కనిపిస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ లో యాక్షన్ పేరుతో హద్దులు దాటేస్తోంది రక్తపాతం అన్నట్టుగా కనిపిస్తోంది. భారతదేశంలో మొదటిసారి R రేటెడ్ సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ నిండా కనిపిస్తున్న నరుకుడు, ఒళ్ళు గోగుర్పొడిచేలా ఉండే వయోలెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆర్ రేటెడ్ పేరిట నిర్మించని రక్తపాతం..
విశ్వక్ సేన్(Vishwak sen) మార్కెట్ ను పెంచుకోవడం కోసం లేదా ఒక సరికొత్త డిఫరెంట్ జోనర్ తో సక్సెస్ కొట్టాలని ఇలాంటి మితిమీరిన రక్తపాతాన్ని చూపించాల్సిన అవసరం ఏముంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ట్రైలర్ మొత్తం డ్రగ్స్ మాఫియా, 300 మందిని బంధించి ఆడించే డెడ్లీ సర్వైవల్ చుట్టూ గేమ్ తిరుగుతున్నట్టుగా ట్రైలర్లో చూపించారు. ఇందులో ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వారికి ఇచ్చే శిక్షలు మనసులను వేటాడి చంపే సీన్లను చూస్తూ ఉంటే ఇదొక హింసాత్మకమైన సినిమా అన్నట్టుగా కనిపిస్తోంది. పోలీస్ పాత్రలో విశ్వక్ ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో ఆయన లుక్ బాగున్నా సీన్లలో కనిపిస్తున్న విపరీతమైన క్రూరత్వం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు దూరం చేసేలా కనిపిస్తోంది.
also read:Tiger Shroff:టైగర్ ష్రాఫ్ పై తుపాకీతో కాల్పులు.. వారి పనేనా..?
సెన్సార్ హద్దులు దాటుతున్న ఈ సినిమాలో ఆడియన్స్ ఆదరిస్తారా?
కల్ట్ సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే.. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్లో కొన్ని కీలకమైన పాయింట్లు తీసుకొని మరి ఈ చిత్రాన్ని తీసినట్లుగా కనిపిస్తోంది. మరి మన నేటివిటీకి, మన ప్రేక్షకులకు ఇంత రక్తపాతం నిజంగానే రుచిస్తుందా లేదా అనే ఆలోచన ఇప్పుడు అందరిలో మొదలవుతోంది. R రేటెడ్ అన్న ట్యాగ్ ను అడ్డుపెట్టుకొని సెన్సార్ హద్దులను దాటేస్తూ చూపించే ఇలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనే విషయం చూడాలి. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 30వ తేదీన థియేటర్లలోకి రాబోతోంది.
also read:Rashmika Mandanna:బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. వైరల్ అవుతున్న వీడియోలు!
విశ్వక్ సేన్ కెరియర్..
విశ్వక్ సేన్ కెరియర్ విషయానికి వస్తే.. 2009లో బంగారు బాబు అనే చిత్రం ద్వారా తన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆ తర్వాత 2017లో వెళ్ళిపోమాకే అనే చిత్రంలో కూడా నటించారు. కానీ 2018 లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంలో నటించి బాగా ఆకట్టుకున్నారు. ఇక హీరోగా , డైరెక్టర్గా ఫలక్నామా దాస్ సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు విశ్వక్ సేన్. ఆ తర్వాత హిట్ ఫస్ట్ కేస్ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పాగల్, ఓరి దేవుడా, దాస్ కా దమ్ కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకి, లైలా, ఫంకీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరిగా నటించిన మూడు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందుకే ఈసారి కల్ట్ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు విశ్వక్ సేన్. తదుపరి సినిమాల విషయానికి వస్తే.. ENE రిపీట్, లెగసి వంటి చిత్రాలు ఉన్నాయి.




