Jana nayagan:టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన శ్రీలీల అందం అభినయంతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. శ్రీలీల కెరియర్ లో సక్సెస్ లేకపోయినప్పటికీ.. స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. కొన్ని చిత్రాలు ఏకంగా శ్రీ లీల వల్ల ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా శ్రీలీల కెరియర్ కు మంచి పేరు తెచ్చి పెట్టిన చిత్రాలలో భగవంత్ కేసరి సినిమా కూడా ఒకటి. ఈ చిత్రంలో బాలయ్యకు కూతురి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇదే సినిమా.. తమిళ హీరో సీఎం విజయ్ నటించిన జననాయగన్(Jana nayagan) స్టోరీ కూడా ఒకేలాగ ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపించాయి.
భగవంత్ కేసరి కి రీమేక్..
ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రాగా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా భగవంత్ కేసరి రీమేక్ అనే వార్తలు వినిపించినా.. ఈ విషయంపై చిత్ర బృందం స్పందించలేదు. కానీ ట్రైలర్ విడుదల చేయగా.. భగవత్ కేసరి సినిమా ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కించారని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి భగవంత్ కేసరి సినిమా చూసిన విజయ్ చాలా ఇంప్రెస్ అయ్యారని తెలియజేశారు.
also read:Nagababu:’జబర్దస్త్’ రీ ఎంట్రీతో నాగబాబు జాక్‌పాట్.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?
శ్రీలీలను ఎంపిక చేసుకోకపోవడానికి కారణం..
ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన సీన్స్ తీసుకొని వాటి చుట్టూ సరికొత్త కథను రూపొందించారని.. అయినా సరే మేకర్స్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారని తెలియజేశారు. భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల కీలకమైన పాత్రలో నటించగా , జననాయగన్ చిత్రంలో మాత్రం మమిత బైజు నటించింది. అయితే ఈ సినిమాలో శ్రీలీలను ఎందుకు తీసుకోలేదు? అనే ప్రశ్న పై డైరెక్టర్ హెచ్ వినోద్ స్పందిస్తూ.. మొదట శ్రీలీలాతో పాటుగా మరికొంతమంది నటీనటుల పేర్లను పరిశీలించమని.. ఆ క్రమంలో భాగంగానే చివరకు ఇందులో మమిత బైజును ఎంపిక చేసామని తెలియజేశారు.
also read:Jananayakudu:విజయ్ ‘జన నాయకుడు’ సినిమా ఎలా ఉంది? పూర్తి రివ్యూ, రేటింగ్ ఇదే..!
విజయ్ చివరి సినిమానా?
ఇప్పటికే జననాయగన్ సినిమా పైన విడుదలకు ముందే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద ఇలాంటి కలెక్షన్స్ ని రాబడుతుందో చూడాలి మరి. విజయ్ సీఎం అయిన తర్వాత మొదటిసారి జననాయగన్ సినిమా విడుదలయ్యింది. అయితే ఈ సినిమాని చివరి సినిమా అన్నట్టుగా వార్తలు వినిపించిన కానీ ఇది చివరి సినిమా కాదని కోలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి తదుపరి సినిమాపై కూడా ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.




