Friday, July 24, 2026
HomeLATESTNagababu:'జబర్దస్త్' రీ ఎంట్రీతో నాగబాబు జాక్‌పాట్.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

Nagababu:’జబర్దస్త్’ రీ ఎంట్రీతో నాగబాబు జాక్‌పాట్.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

Nagababu:జబర్దస్త్ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాగబాబు ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు?

on
- Advertisement -banner Ad

Nagababu:తెలుగు టెలివిజన్ లో అత్యంత విజయవంతమైన కామెడీ షో లలో ఒక్కటైన “జబర్దస్త్”.. గత 13 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈ షో ద్వారా పలువురు కమెడియన్లు సినీ పరిశ్రమలో కూడా అవకాశాలు దక్కించుకొని స్టార్ స్థాయికి చేరుకున్నారు. అయితే ప్రముఖ కళాకారులు ఒక్కొక్కరుగా షోను విడిన తర్వాత ఈ జబర్దస్త్ టిఆర్పి రేటింగ్స్ బాగా డౌన్ అయిపోయినట్లు టెలివిజన్ వర్గాలల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే షో సమయాన్ని మారుస్తూ నిర్వాహకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఆదివారం సాయంత్రం కొత్త టైం స్లాట్:

ఇప్పటివరకు గురు, శుక్రవారాలు అనంతరం శుక్ర, శనివారాల్లో ప్రసారమైన ఈ కామెడీ షో ఇకపై జూలై 26 నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. కొత్త టైమ్ స్లాట్ తో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు పలు మార్పులు కూడా చేపట్టారు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది మళ్లీ జబర్దస్త్ లోకి రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచేసింది.

- Advertisement -
Advertisement

also read:Jananayakudu:విజయ్ ‘జన నాయకుడు’ సినిమా ఎలా ఉంది? పూర్తి రివ్యూ, రేటింగ్ ఇదే..!

నాగబాబు రీఎంట్రీ తో పెరిగిన ఆసక్తి :

ఇటీవల ప్రముఖ నటుడు నాగబాబు (Nagababu) జడ్జీగా తిరిగి షోలో అడుగుపెట్టడం విశేషంగా మారింది. గతంలో జబర్దస్త్ ను విడిన తొలి ప్రధాన వ్యక్తులలో నాగబాబు ఒకరు. అనంతరం రోజా, చమ్మక్ చంద్ర, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను , హైపర్ ఆది తదితరులు కూడా సినిమాలు.. ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడంతో షోకు దూరమయ్యారు. ఇప్పుడు వీరిలో కొందరు తిరిగి రావడం షోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

- Advertisement -
Advertisement

also read:Tollywood:ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు.. 2027లో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న సినిమాలివే!

రెమ్యూనరేషన్ పై చర్చ భవిష్యత్తుపై ఆసక్తి :

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు సీనియర్ నటి ఇంద్రజ కూడా జడ్జీగా కొనసాగుతున్నారు. అయితే ఈ పారితోషకాలపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. ప్రసార సమయం మార్పు, ప్రముఖుల రీఎంట్రీలు జబర్దస్త్ కి మళ్లీ పాత వైభవాన్ని తీసుకువస్తాయా..? లేక టిఆర్పి రేటింగ్స్ లో ఆశించిన ఫలితం వస్తుందా..? అన్నది రాబోయే వారాలలో తేలనుంది. ప్రస్తుతం ఈ మార్పులపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you