Friday, July 24, 2026
HomeLATESTKajal Agarwal:కాజల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సినిమా వాయిదా?

Kajal Agarwal:కాజల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. సినిమా వాయిదా?

Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో రాబోతున్న ది ఇండియా స్టోరీ సినిమా వాయిదా పడిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Kajal Agarwal:టాలీవుడ్, కోలీవుడ్లో స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన కాజల్ అగర్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన కాజల్ వివాహం అనంతరం ఈమె స్పీడ్ తగ్గించిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సీనియర్ హీరోలకు జోడిగా నటిస్తూ.. కెరియర్ని నెట్టుకొస్తున్న కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. అయితే ఇప్పటివరకు అలా నటించిన చిత్రాలు ఏవి కూడా ఈమె పెద్దగా సక్సెస్ అందివ్వలేదు. ఇప్పుడు తాజాగా ది ఇండియా స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ది ఇండియా స్టోరీ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్న కాజల్..

జులై 24వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ది ఇండియా స్టోరీ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్, టీజర్ కూడా విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకొని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎక్కువగా వ్యవసాయ రంగంలో పురుగుల మందు వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది అనే విషయాలను మేకర్స్ చూపించినట్లుగా చాలా స్పష్టంగా ట్రైలర్ లో అయితే కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా పైన ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగినట్టు కనిపిస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Jana nayagan: జననాయగన్ చిత్రంలో శ్రీలీలను తీసుకోకపోవడానికి కారణం ?

సినిమా విడుదల ఆగనుందా?

డైరెక్టర్ చేతన్ డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఒక పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించబోతోంది. తన కెరీర్ లోనే ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించిన కాజల్.. ఇప్పుడు కూడా మరో ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతోంది. బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు డబ్బింగ్ పనులు కూడా పూర్తి అయ్యాయి. అయితే తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

- Advertisement -
Advertisement

also read:Nagababu:’జబర్దస్త్’ రీ ఎంట్రీతో నాగబాబు జాక్‌పాట్.. ఒక్కో ఎపిసోడ్‌కు ఎంత తీసుకుంటున్నారో తెలుసా..?

రేపటి వరకు ఎదురు చూడాల్సిందే..

తాజాగా ది ఇండియన్ స్టోరీ సినిమా అనుకున్న తేదీకి విడుదల కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి కేవలం హిందీ వర్షన్ మాత్రమే అనుకున్న తేదీకి విడుదల కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి. సామాజిక సందేశం తో తెరకెక్కిస్తున్న ది ఇండియా స్టోరీ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? కాజల్ అగర్వాల్ కెరియర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందా అనే విషయం తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you