Monday, October 26, 2026
HomeLATESTAnirudh:జోనీతా గాంధీ ఎవరు? అనిరుధ్ తో బంధం ఏంటి..?

Anirudh:జోనీతా గాంధీ ఎవరు? అనిరుధ్ తో బంధం ఏంటి..?

Anirudh: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ కావ్య మారన్ తో పెళ్లి వార్తలు వస్తున్న వేళ.. ఎవరి జోనీత గాంధీ అనే వార్త వైరల్ గా మారింది..

on
- Advertisement -banner Ad

Anirudh:సింగర్ జోనీతా గాంధీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఈమె పేరు ట్రెండీగా మారింది. ముఖ్యంగా ఈమె చేస్తున్న పోస్టులు , వీడియోల వల్ల ఈమెకు భారీగా లైకులు, షేర్లు వస్తున్నాయి. దీంతో ఈమె వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గత వారం నుంచి ఈమె పైన పలు రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పెళ్లి తేది అధికారికంగా బయటికి వచ్చినప్పటి నుంచి జోనితా వ్యవహారం ఎక్కువగా వినిపిస్తోంది.

ఎవరీ జోనితా?

జోనీత చేస్తున్న పోస్టులు వల్ల పలు రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఎందుకు జోనీతా గాంధీ ఎవరనే విషయంపై పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో, గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. జోనీతా వ్యక్తిగత విషయాలకు వస్తే ఈమె పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి. కెనడాలో స్థిరపడిన హిందూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఢిల్లీలో పుట్టి పెరగడం వల్ల గాయనీగా కెనడాలో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. కెనడాలో బిజినెస్, హెల్త్ సైన్స్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసిందట. అనంతరం వెస్ట్రన్ హిందుస్థాని సంగీతంలో ఈమె శిక్షణ తీసుకున్నారు.

- Advertisement -
Advertisement

also read:Zombie Reddy 2:జాంబీ రెడ్డి 2 నుంచి దర్శకుడు అవుట్.. కొత్త డైరెక్టర్ ఎవరంటే?

జోనితా పాటలు..

ఆ తర్వాత భారతీయ సినీ రంగంలో మ్యూజిక్ ఇండస్ట్రీలో గాయనిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, పంజాబీ, మరాఠీ ఇతర భాషలలో సుమారుగా వందలాది పాటలు పాడి బాగానే ఆకట్టుకున్నది. తెలుగులో కిక్ 2, కేరింత, చెలియా, ఓకే బంగారం, సర్కార్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, బ్రహ్మాస్త్ర, డ్యూడ్ వంటి చిత్రాలకు పాటలు పాడారు. అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ బ్యూటిఫుల్ సింగర్ గా అనిరుధ్(Anirudh) తో కలిసి చాలానే పాటలు పాడి అలరించారు. ఆ సమయంలోనే వారిద్దరు డేటింగ్ చేశారని రూమర్స్ కూడా వినిపించాయి. కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నారనే వార్తలు కూడా వినిపించాయి.

- Advertisement -
Advertisement

also read:Prabhas:ప్రభాస్‌తో సందీప్ వంగా ఫొటో.. ఆ బాటిల్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు!

అనిరుధ్ పెళ్లి వార్తల వేళా వెలుగులోకి జోనిత..

అయితే వారిద్దరు ఎప్పుడూ కూడా తమ ఎఫైర్ గురించి ఏ విషయాన్ని బయట పెట్టలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి బంధం గురించి పలు రకరకాల వార్తలు వినిపించాయి. ఇటీవలి సన్ మీడియా అధినేత కూతురు, సన్రైజర్ ఓనర్ కావ్య మారన్ తో అనిరుధ్ వివాహ వార్తల నేపథ్యంలో ఆమె కొన్ని పోస్టులు పెడుతూ, ఇటీవల పుట్టినరోజు జరిగిన కొన్ని పార్టీల ఫోటోలను కూడా షేర్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ముఖ్యంగా అనిరుధ్ తో కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో జోనీతా తో అనిరుధ్ రిలేషన్ నుంచి బయటికి రాలేకపోతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో అనిరుధ్ పెళ్లికి ముందే ఇలాంటి వార్తలు రావడంతో ఆయన అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. మరి ఈ విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you