Anupama parameswaran:మలయాళ ఇండస్ట్రీ నుంచి చాలా మంది హీరోయిన్స్ ఈ మధ్యకాలంలో హవా కొనసాగిస్తున్నారు. వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అలా అందం, అభినయంతో హీరోయిన్గా ఆకట్టుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. మలయాళం సినిమా ప్రేమమ్ చిత్రం ద్వారా తన కెరీయర్ని మొదలుపెట్టి తెలుగులో అఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా తమిళ్, మలయాళం , తెలుగు సినిమాలలో నటించి బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇటీవలే క్రేజీ కళ్యాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మద్దుగుమ్మ.
నా బాయ్ ఫ్రెండ్ వల్లే పెళ్లి, పిల్లల ఆలోచనకు దూరం..
గత కొద్ది రోజుల నుంచి అనుపమ పర్సనల్ లైఫ్ విషయాలకు సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది.. ముఖ్యంగా ఈమె లవ్ బ్రేకప్ అయినప్పటి నుంచి ఈమె చేసిన కామెంట్స్ ద్వారా కూడా ఈమె పేరు వినిపిస్తోంది. ముఖ్యంగా వివాహం అంటే తనకు ఇష్టం లేకుండా తన మాజీ బాయ్ ఫ్రెండ్ చేశారని , తాను ప్రేమలో పడనంతవరకు పెళ్లి గురించి , పిల్లల గురించి చాలా కలలు కన్నాను కానీ తన బాయ్ ఫ్రెండ్ చేసిన పనుల వల్ల తనకి పెళ్లి , పిల్లలంటే నచ్చకుండా పోయిందంటూ కామెంట్స్ చేసింది.
also read:Upasana Konidela:ఉపాసన సంచలన వ్యాఖ్యలు.. మహిళలకు స్ట్రాంగ్ వార్నింగ్!
నా తొలి మూవీ పేరునే ఇంటిపేరు..
ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుపమ తన సొంత ఇంటి గురించి పలు విషయాలను తెలియజేసింది.. అనుపమ మాట్లాడుతూ తన ఊర్లో ఆ ప్లేస్లో తాను పుట్టి పెరిగానని, మా నాన్న కూడా అక్కడే పుట్టి పెరిగారు. మా అమ్మ కూడా మా దగ్గరలోనే, మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఎడ్యుకేషన్ లోను తీసుకొని మరి చదువుకున్నాను.. ప్రేమమ్ సినిమాతో వచ్చిన నా మొదటి సంపాదనతో నా ఎడ్యుకేషన్ లోను క్లియర్ చేశానని , ఆ సినిమాతో అప్పుడు నా లైఫ్ పూర్తిగా మారిపోయింది .అప్పుడు నేను పుట్టిన చోటే నాలుగున్నర సెంట్లు స్థలం కొనుక్కోగలిగానని అందులోని ఇల్లు కట్టుకున్నానని తెలిపింది.
also read:Mahesh Babu:హనుమాన్ టీమ్‌కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. చైతన్య రెడ్డి ఓపెన్ కామెంట్స్!
అందుకే అలా డిజైన్ చేయించాను..
అలా ఇల్లు కట్టుకోవడానికి ముఖ్య కారణం ప్రేమమ్ సినిమా నే అంటూ తెలియజేసింది అనుపమ . 2017లో ఆ ఇల్లు పూర్తి అయ్యింది ప్రేమం సినిమా వల్లే నా జీవితం లో సొంత ఇల్లు కట్టుకునేలా చేసింది కాబట్టి నేను నా ఇంటికి ప్రేమమ్ అనే పేరు పెట్టుకున్నాను అంటూ వెల్లడించింది. అనుపమ పరమేశ్వరన్ తన ఇంటికి ప్రేమమ్ అని ఒక మలయాళ అక్షరాలతో ఉన్నటువంటి పేరును కూడా డిజైన్ చేసి మరి తన ఇంటి పైన ఆ పేరు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తనకు లైఫ్ ఇచ్చిన సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న అనుపమ ను చూసి అభిమానులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం హీరో శర్వానంద్ నటిస్తున్న భోగి అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శతమానం భవతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు భోగి సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు.




