Zombie Reddy 2:టాలీవుడ్లో హారర్ కామెడీ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భయపెట్టే సన్నివేశాలతో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీని జోడించి తెరకెక్కించే చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కొత్త కథలు, విభిన్నమైన కథనాలతో రూపొందుతున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నాయి. దీంతో ఈ జానర్లో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
‘జాంబీ రెడ్డి’తో ప్రత్యేక గుర్తింపు :
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘జాంబీ రెడ్డి’ ఈ తరహా చిత్రాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తనదైన శైలిలో కథను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వినూత్నమైన కథాంశం, హారర్ అంశాలు, కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును పొందింది. తేజ సజ్జాకు కూడా ఈ సినిమా కెరీర్లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది.
సీక్వెల్‌పై పెరిగిన అంచనాలు:
‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్‌గా ‘జాంబీ రెడ్డి 2’ (Zombie Reddy 2)తెరకెక్కనుందనే వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. మొదటి భాగం విజయంతో రెండో భాగంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి కథ ఎలా ఉండబోతోంది? ఎలాంటి హారర్, కామెడీ అంశాలు ఉండనున్నాయి? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాంబీ రెడ్డి 2పై భారీ అంచనాలు :
‘జాంబీ రెడ్డి’ సాధించిన గుర్తింపుతో దాని సీక్వెల్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘జాంబీ రెడ్డి 2’ను రూపొందించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. మొదటి భాగంలో కనిపించిన హారర్, కామెడీ అంశాలను సీక్వెల్లో మరింత ఆసక్తికరంగా చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.ఈ సినిమాకు సూపర్న్ వర్మ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.గడచిన కొద్ది రోజుల క్రితం జాంబిరెడ్డి 2 సినిమా నుంచి విడుదలైన యానిమేషన్ వీడియో కూడా సినిమా పైన మరింత క్యూరియాసిటీని పెంచేసింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు వార్తలు వినిపించాయి. అయితే, సినిమా నిర్మాణం సజావుగా సాగుతోందని భావిస్తున్న సమయంలో దర్శకుడిని మార్చేశారని తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
also read:Prabhas:ప్రభాస్‌తో సందీప్ వంగా ఫొటో.. ఆ బాటిల్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్లు!
అంతర్గత విభేదాలతో దర్శకుడి మార్పు? :
తాజా సమాచారం ప్రకారం, ‘జాంబీ రెడ్డి 2’ చిత్రబృందంలో అంతర్గత విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సూపర్న్ వర్మను దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరో దర్శకుడిని తీసుకున్నారని , ఒక సినిమా నిర్మాణంలో దర్శకుడు, నిర్మాతల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు ఇలాంటి మార్పులు చోటుచేసుకోవడం కొత్తేమీ కాదు. కానీ షూటింగ్ కొంతవరకు పూర్తయిన తర్వాత దర్శకుడిని మార్చాల్సి వస్తే, సినిమా నిర్మాణ ప్రణాళికపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలను కొనసాగిస్తారా? కొత్త దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా మార్పులు చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
also read:Prabhas:ప్రభాస్‌తో సినిమా చేస్తే పెళ్లి చేసుకోకూడదా.. నెటిజన్ల క్రేజీ మీమ్స్!
కొత్త దర్శకుడు ఎవరనేది సస్పెన్సే!:
‘జాంబీ రెడ్డి 2’కు కొత్త దర్శకుడు ఎవరనే విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సినిమా తదుపరి షెడ్యూల్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? విడుదల తేదీలో ఏమైనా మార్పులు ఉంటాయా? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి.అయితే, కొత్త దర్శకుడి పేరు, చిత్రీకరణకు సంబంధించిన తదుపరి ప్రణాళికలపై చిత బృందం త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనుంది. సీక్వెల్‌పై ఇప్పటికే అంచనాలు పెరిగిన నేపథ్యంలో, దర్శకుడి మార్పు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
షూటింగ్ నిలిపివేత వార్తలు ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, కొత్త దర్శకుడి పేరు, చిత్రీకరణ పునఃప్రారంభం, సినిమా విడుదల తేదీ వంటి అంశాలపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలియనున్నాయి..!!




