Tuesday, August 25, 2026
HomeLATESTRashmika mandanna:అలాంటి అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక!

Rashmika mandanna:అలాంటి అరుదైన రికార్డ్ సృష్టించిన రష్మిక!

Rashmika mandanna: ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా తన సినిమా మైసా కోసం చేస్తున్న పని అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

on
- Advertisement -banner Ad

Rashmika mandanna:తెలుగు హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ తీసుకుపోతోంది. గడిచిన కొద్ది రోజుల క్రితం హీరో విజయ్ దేవరకొండ(vijay deverakonda) తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక (Rashmika Mandanna)వివాహం అనంతరం కూడా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, హిందీ వంటి భాషలలో పలు సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక గ్లామర్ పాత్రలకే కాకుండా కథకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

రష్మిక సాహసం..

ప్రస్తుతం రష్మిక నటిస్తున్న మైసా (Mysaa)సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రాబోతోంది. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక చేసిన ఒక రిస్కీ స్టంట్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. మైసా చిత్రాన్ని డైరెక్టర్ రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతోంది. ఈ పాత్ర కోసం రష్మిక చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం విదేశాలకు వెళ్లి మరీ మార్షల్ ఆర్ట్స్ లో కఠినమైన శిక్షణ కూడా తీసుకుంది.

- Advertisement -
Advertisement

also read:Allu Arjun:హమ్మయ్య.. బన్నీ నెత్తి మీద నుంచి పెద్ద భారం దించేసిన లోకేష్.. థ్యాంక్స్ బ్రో..!

20 గంటల పాటు నిర్విరామంగా..

తాజాగా ఈ చిత్రంలో ఒక అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ కోసం రష్మిక చేసిన ధైర్యం చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వాస్తవంగా ఇలాంటి రిస్కీ స్టంట్ కోసం డూప్ లేదా బాడీ డబుల్ ఉపయోగిస్తుంటారు. కానీ రష్మిక మాత్రం అలాంటివేవీ ఉపయోగించుకోకుండా సహజత్వం కోసం ప్రయత్నాలు చేసింది. గత రెండు రోజులపాటు అనగా 20 గంటల సమయాన్ని నీటిలోనే గడుపుతూ అండర్ వాటర్ ఫైట్ సీన్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. భారతీయ చలన చిత్రం లోనే మహిళా ప్రధాన పాత్రలో ఒక హీరోయిన్ ఇలా చేయడం చాలా అరుదుగా మారింది.

- Advertisement -
Advertisement

also read:Akhil:మాజీ వదినమ్మకు భారీ జలక్ ఇచ్చిన అఖిల్..సమంతకి బిగ్ షాక్..?

టెక్నికల్ టీం కూడా ఆశ్చర్యపోయేలా..

ఈ సీన్ చేయడానికి రష్మిక పడ్డ కష్టాన్ని, ధైర్యాన్ని చూసి టెక్నికల్ టీం కూడా ఆశ్చర్యపోయింది. ఈ ఎపిసోడ్ ఫైట్ మాత్రమే కాదని స్క్రీన్ మీద ఒక విజువల్ వండర్ లా ఉండబోతోందని వినిపిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ రవీంద్ర, ఈశ్వరి రావు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. రష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ఇండస్ట్రీతో హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన గీతాగోవిందం సినిమాతో మంచి స్టార్డం అందుకుంది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరు, భీష్మ, సుల్తాన్, పుష్ప, సీతారామం , యానిమల్, పుష్ప 2, ఛావా తదితర చిత్రాలలో నటించి భారీ విజయాలను అందుకుంది. ప్రస్తుతం తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి అనే సినిమాలో కూడా నటిస్తోంది.

- Advertisement -
Advertisement

https://www.instagram.com/p/DakLhy8ibcp/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you