Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ తర్వాత చేస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, గ్లింప్స్ అన్నీ కూడా ఫ్యాన్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఎప్పుడూ లేని విధంగా హరీష్ శంకర్ కూడా ఈసారి ముందుండి ప్రమోషన్స్ నడిస్తున్నారు. మీడియాతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సినిమాకు సంబంధించి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. అంతేనా, ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ చేయడానికి చాలా అంటే చాలానే కష్టపడుతున్నారు.
ఎవరినీ కించ పరచదు- Ustaad Bhagat Singh
వాస్తవానికి ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు వైసీపీ టార్గెట్ అన్నట్లుగా కొన్ని వీడియోలు విడుదల చేశారు. అవన్నీ ఏం ఉండవని, ఏ పార్టీని, ఏ వ్యక్తిని ఈ సినిమాలో కించపరచలేదని హరీష్ శంకర్ తెలుపుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో అలాంటివి వద్దు, సినిమా అంటే వినోదం, కేవలం వినోదం అందించే కోణంలోనే సినిమా ఉండేలా చూసుకోవాలని ఆర్డర్స్ వేసినట్లుగా చెప్పుకొచ్చారు. అలాగే ఫ్యాన్స్ కూడా హరీష్ శంకర్‌ని ఇదే కోరుకుంటున్నారట. ఎవరినీ కించ పరిచేలా డైలాగ్స్ వద్దని వేడుకుంటున్నారట. ఒక మనిషిని అభిమానిస్తే, ఇలా కూడా చెబుతారా? ఒక మనిషిని ఫాలో అవడం అంటే, ఏదో ఫ్యాన్ అని కాకుండా ఆయన సిద్ధాంతాలను కూడా ఫాలో అవుతారా? అని ఆశ్చర్యపోయాను. అందుకే, ఈ సినిమాను అందరికీ రీచ్ అయ్యేలా, ఎక్కడా ఎటువంటి వ్యతిరేకత రాకుండా, లేకుండా చేశానని, ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుందని హరీష్ శంకర్ తన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
దేవిశ్రీ ప్లేస్‌లోకి థమన్
రాజకీయ పార్టీలను, రాజకీయ వ్యక్తులను కించపరిచేలా ఏ ఒక్క సీన్ ఉండదని చెప్పిన హరీష్ శంకర్, హీరో ఎలివేషన్స్‌కు మాత్రం లోటుండదని వివరణ ఇచ్చారు. గాజు గ్లాస్ డైలాగ్ కూడా పార్టీని ఉద్దేశించినది కాదని, కేవలం ఎలివేషన్ కోసమే రాశానని చెప్పారు. హరీష్ శంకర్ ఈ ఇంటర్వ్యూ తర్వాత, సినిమాకు సంబంధించి అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా, హరీష్ శంకర్ అనగానే గుర్తొచ్చే దేవి శ్రీ ప్రసాద్ చివరి నిమిషంలో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. పాటలన్నింటికీ సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి మాత్రం టైమ్ సరిపోదంటూ, ఆ బాధ్యతని వేరొకరికి అప్పగించాలని చాలా సున్నితంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడా ప్లేస్‌లోకి ‘ఓజీ’ థమన్ వచ్చి చేరారు.
Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఇంకా సినిమాలు చేస్తాడా?
వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్
వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి రేర్‌గా జరుగుతుంటాయి. ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకుని, కొంత పార్ట్ పూర్తి చేసిన తర్వాత.. వేరొక మ్యూజిక్ డైరెక్టర్ ఆ సినిమాను టేకప్ చేయరు. కేవలం ఏదైనా ఒక పాట కావాలంటే చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ, సినిమా రిలీజ్ ఇంకో వారం, 10 రోజులు ఉందనగా.. మ్యూజిక్ డైరెక్టర్ ఛేంజ్ అవడం చాలా రేర్‌గా జరుగుతుంది. అందులోనూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ విషయంలో అసలు ఇలాంటివి జరగవు. అసలే దేవిశ్రీ వర్సెస్ థమన్ (SS Thaman) అన్నట్లుగా అక్కడ పిక్చరైజేషన్ ఉంది. మరి ఇలాంటి సమయంలో కూడా దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్న ప్రాజెక్ట్‌లోకి థమన్ వచ్చాడంటే, అందుకు కారణం మాత్రం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పుకోవాలి.

నిర్మాతలు చెప్పింది ఇదే
అసలు దేవి శ్రీ ప్రసాద్‌కు ఏమైంది? ఎందుకు తప్పుకున్నాడు? అనే అనుమానాలు రావడం సహజమే. దీనికి మూవీ టీమ్ ఇచ్చిన వివరణ ఏంటంటే, దేవి శ్రీ ప్రసాద్‌కు సకాలంలో రీల్ (చిత్రీకరణ జరుపుకున్న కంటెంట్) ఇవ్వడంలో ఆలస్యం జరిగిందట. అందువల్ల ఈ సినిమాకు దేవిశ్రీ కేటాయించిన సమయం అయిపోయిందని, ముందస్తు ఒప్పందాల కారణంగా తన షెడ్యూల్‌ని ఈ సినిమాకు సర్దుబాటు చేయలేకపోయాడని, ఆయన నిర్ణయాన్ని మేము గౌరవిస్తామని నిర్మాతలు తెలిపారు. పరస్పర అంగీకారంతోనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చేసేందుకు థమన్‌ని తీసుకున్నట్లుగా కూడా వారు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. సరే, అదే నిజమని అనుకుందాం. కానీ, పవన్ కళ్యాణ్ సినిమాను పక్కన పెట్టేయడం, ఆయన సినిమాకు నో చెప్పడం అంటే, మాములు విషయం కాదు. ఎంతో మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు.
Also Read- Virosh Wedding: విజయ్, రష్మికల ప్రేమ నుంచి పెళ్లి రిసెప్షన్ వరకు.. జరిగింది ఇదే!
అసలు విషయం చెప్పాల్సింది
డేట్స్, సర్దుబాట్లు అని చెప్పకుండా.. దేవి శ్రీ ప్రసాద్ నటన వైపు వెళ్లిపోయాడు. సంగీతం అందించడానికి టైమ్ ఉండటం లేదని చెప్పి ఉంటే సరిపోయేది. ఎందుకంటే, రీసెంట్‌గానే దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఎల్లమ్మ’కు సంబంధించి గ్లింప్స్ వచ్చింది. ఎప్పటి నుంచో వినిపిస్తున్న దేవిశ్రీ హీరోగా అరంగేట్రానికి ఇప్పుడు ముడిపడింది. అందుకే, నటనపై ఇంట్రస్ట్ పెట్టి, సంగీతాన్ని పక్కన పెట్టేశాడని చెబితే, అంతా నమ్మేవాళ్లు. అంతేకానీ, డేట్స్, టైమ్ అని చెప్తే ఎవరు నమ్ముతారు. మంచిదే, దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నందుకు అంతా హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే, ఇది ఆయన కల. అదే విషయాన్ని చెప్పి ఉంటే, దేవిశ్రీ పై ఇంకాస్త గౌరవం పెరిగేది. అలా కాకుండా, నిర్మాతలు ఏదో చెబితే ఎవరూ నమ్మరు. అందులోనూ పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసి వెళ్లాడంటే, కొంచెం నెగిటివిటీ కూడా యాడ్ అవుతుందని మాత్రం వాళ్లు గమనించలేదు.
ఇంకా ముందే విడుదల
మరో వైపు ఈ సినిమా ఇంకాస్త ముందుకు వచ్చేసింది. అవును, మార్చి 26 అనుకున్న ఈ సినిమాను మార్చి 19నే విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ ప్రకటన వచ్చినప్పటి నుంచి, నిద్రాహారాలు మాని మరీ, ఈ సినిమాను ఆ టైమ్‌కు దించేందుకు మేకర్స్ కష్టపడుతున్నారు. ఈ సడెన్ నిర్ణయం తీసుకోవడానికి కారణం వరుస సెలవులు ఉండటమే. కాకపోతే, ఆ టైమ్‌కి సినిమాను తీసుకు రాగలరా? అనే అనుమానం కూడా ఓ వైపు ఫ్యాన్స్‌లో ఉంది. థమన్ అనగానే ఫ్యాన్స్ కూడా హ్యాపీగానే ఫీలవుతున్నారు. ఎందుకంటే, ‘ఓజీ’ సినిమాకు థమన్ మ్యూజిక్ ఎలా ప్లస్ అయ్యిందో తెలియంది కాదు. మరోసారి థమన్ తనేంటో నిరూపించుకుంటాడని అంతా అనుకుంటున్నారు.
Two stalwart musicians join hands for PSPK ❤🔥#UstaadBhagatSingh songs by @ThisisDSP & the background score by @MusicThaman are going to be a treat 💥💥
This will be a grand celebration and a lifetime memory for fans ❤️
POWER STAR @PawanKalyan @harish2you @sreeleela14… pic.twitter.com/060Vz0ONFK
— Mythri Movie Makers (@MythriOfficial) March 4, 2026
‘ఉస్తాద్’ వర్సెస్ ‘ధురందర్ 2’
ఏది ఏమైనా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంత ఎర్లీగా థియేటర్లలోకి తీసుకు వస్తున్నందుకు మాత్రం ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మరి షెడ్యూల్స్ అన్నీ మారాయి కాబట్టి.. బిజినెస్ ఎలా జరుగుతుందో చూడాలి. అలాగే, అదే రోజు ‘ధురంధర్ 2’ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇటీవల వచ్చిన ఈ సినిమా పార్ట్ 1 ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలియంది కాదు. మరి పార్ట్ 2 తెలుగులో కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా ‘ఉస్తాద్’పై పడుతుందా? అనేలా కూడా టాక్ వినిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ తెలుగులో విడుదల కాలేదు. ఓటీటీలో మాత్రమే విడుదలైంది. మరి, ఈ క్రమంలో ‘ఉస్తాద్’పై అంత ప్రభావం పడే అవకాశం అయితే లేదు. అందులోనూ తెలుగులో పవర్ స్టార్ స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. కాబట్టి.. ‘ఉస్తాద్’ ఎఫెక్టే ‘ధురంధర్ 2’పై పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందనేది తెలియాలంటే మాత్రం మార్చి 19 వరకు వెయిట్ చేయాల్సిందే.

