Wednesday, July 22, 2026
HomeLATESTTollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత!

Tollywood: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సినీ నిర్మాత కన్నుమూత!

Tollywood: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నిర్మాత కన్నుమూశారు. అయితే ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

on
- Advertisement -banner Ad

Tollywood: ఇటీవల కాలంలో సెలబ్రిటీల మరణాలు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు(Gottimukkala Padma Rao) కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని తన నివాసంలో ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈయన మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.అయితే పద్మారావు మరణానికి గల కారణం ఏంటి? అనే విషయం మాత్రం ఇంకా తెలియ రాలేదు.

పద్మారావు సినీ ప్రస్థానం..

1954 నవంబర్ 8న జన్మించిన గొట్టిముక్కల పద్మారావు చిన్నతనం నుంచే సినిమాలపై మక్కువ పెంచుకున్నారు. దీంతో పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు సినిమా నిర్మాతగా తన కెరీర్ ను ప్రారంభించారు. అలా 1985లో సుమన్ హీరోగా వచ్చిన కంచు కవచం అనే చిత్రాన్ని నిర్మించి, నిర్మాతగా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు గొట్టిముక్కల పద్మారావు. 1986లో పిఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన శ్రీ వేమన చరిత్ర సినిమాకి సహనిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక తర్వాత 1991లో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) హీరోగా, వంశీ దర్శకత్వంలో వచ్చిన ఏప్రిల్ 1 విడుదల సినిమాను నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో నిర్మాతగా ఆయన మళ్లీ వెను తిరిగి చూసుకోలేదు. మళ్లీ రాజేంద్రప్రసాద్ హీరోగా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 1996లో జోకర్ అనే సినిమాను నిర్మించారు. ఇక చివరిగా 2006లో నీ నవ్వే చాలు అనే సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు.

- Advertisement -
Advertisement

also read:Deewana movie review:దీవానా మూవీ రివ్యూ.. హృదయాన్ని కదిలించిందా?

వారసులు కూడా సినీ రంగ ప్రవేశం..

గొట్టిముక్కల పద్మారావు మాత్రమే నిర్మాత కాదు ఆయన వారసులు కూడా సినీ రంగాన్ని ఎంచుకున్నారు. వీరిలో పెద్ద కుమార్తె సృజనారావు గమనం అనే సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. అలా ఆయన వారసురాలిగా వచ్చిన ఈమె ఇండస్ట్రీలో దర్శకురాలిగా అవతరించి అందరి దృష్టిని ఆకర్షించారు.

- Advertisement -
Advertisement

also read:Transfer Trimurthulu:ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు రివ్యూ.. 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ వర్కౌట్ అయిందా?

గొట్టిముక్కల పద్మారావు రాజకీయ ప్రస్థానం..

ఇకపోతే పద్మారావు సినిమాలతో పాటు అటు రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. అంతేకాదు మలిదశ ఉద్యమంలో కూడా పద్మారావు పాల్గొన్నారు. 1996లో టిడిపి నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ లో చేరారు. 2014లో కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఈయన.. 2018లో కాంగ్రెస్లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you