Wednesday, July 22, 2026
HomeLATESTDhanush:ప్రేమే లేని చోట బ్రేకప్ ఏంటి.. తెర వెనుక అసలు నిజం!

Dhanush:ప్రేమే లేని చోట బ్రేకప్ ఏంటి.. తెర వెనుక అసలు నిజం!

Dhanush: గత కొంతకాలంగా ధనుష్, మృణాల్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాగా ఇప్పుడు వీరిద్దరూ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Dhanush:నిప్పు లేనిదే పొగరాదు అంటారు అందుకే సోషల్ మీడియాలో ఒక జంటపై ఏదైనా రూమర్స్ వచ్చాయి అంటే కచ్చితంగా వారి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇలా వచ్చిన రూమర్స్ ను కొంతమంది సెలబ్రిటీలు నిజం చేస్తే.. మరి కొంత మంది కొట్టి పారేస్తూ ఉంటారు .అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఒక సెలబ్రిటీ జంట మధ్య ప్రేమే లేదు కానీ వారిద్దరు విడిపోయారు అంటూ వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. మరి తెర వెనుక అసలు నిజం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రేమలో పడ్డారంటూ రూమర్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు అంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పైగా వీళ్ళిద్దరూ పలు సందర్భాలలో కలసి కనిపించడం, ఒకరి వ్యక్తిగత విషయాలపై మరొకరు ఆసక్తి చూపించడంతో ఈ రూమర్లు మరింత జోరుగా వినిపించాయి. ముఖ్యంగా గత ఏడాది ఆగస్టులో జరిగిన సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్ షోలో ఈ జంట కలసి సందడి చేయడం అభిమానులను ఆకట్టుకుంది. పైగా ధనుష్ హిందీలో నటించిన తేరే ఇష్క్ మే సినిమా సక్సెస్ పార్టీకి కూడా మృణాల్ ప్రత్యేకంగా హాజరు కావడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. అంతేకాదు ధనుష్ సోదరీమణులైన డాక్టర్ కార్తీక, విమల గీతాలను ఇంస్టాగ్రామ్ అకౌంట్లో మృణాల్ ఫాలో కొట్టింది. ఇక దీంతో పెళ్లి ఖాయం అనే వార్తలు జోరందుకున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Aamir Khan : మూడో పెళ్లి ప్రకటన చేసిన మిస్టర్ పర్ఫెక్ట్.. పెళ్లెప్పుడు అంటే?

విడిపోయారంటూ కొత్త వార్తలు..

ఇకపోతే ఈ విషయాలపై ధనుష్ ఎప్పుడు స్పందించకపోయినా మృణాల్ మాత్రం ధనుష్ తనకు స్నేహితుడు మాత్రమే అని కామెంట్లు చేసింది. కానీ వీరిద్దరికీ సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు మాత్రం వీరు నిజంగానే రిలేషన్ లో ఉన్నారని, కాకపోతే ఆ బంధం ఇంకా ప్రారంభం దశలో ఉందని, అందుకే తమ బంధాన్ని ప్రైవేటుగా ఉంచడానికి ఇష్టపడుతున్నారని కామెంట్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో వీరిద్దరి లవ్ స్టోరీ కి బ్రేక్ పడిందనే మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా దూరం పెరిగిందని, అందుకే పరస్పర అంగీకారంతోనే ఇద్దరు విడిపోయారని సినీ వర్గాల కథనం. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి గల కారణం మాత్రం ఇంకా తెలియ రాలేదు.

- Advertisement -
Advertisement

also read:Bhagya sree: భాగ్యశ్రీ పెళ్లి రామ్ తోనేనా.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ!

అసలు నిజం ఏమిటి?

ఈ వార్తలు చూసిన కొంత మంది నెటిజన్స్ మాత్రం నివ్వెరపోతున్నారు. అసలు ప్రేమే లేని చోట ఈ బ్రేకప్ ఏంటి? కావాలనే ఎవరో ఇలాంటి అనధికారిక ప్రకటనలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. మరి ఏది ఏమైనా నిజంగానే వీరి బంధం ముగిసిపోయిందా లేక కావాలనే ఎవరైనా ప్రచారం చేస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you