Sunday, June 21, 2026
HomeLATESTBigg boss 10:బిగ్ బాస్ సీజన్ 10 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Bigg boss 10:బిగ్ బాస్ సీజన్ 10 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

Bigg Boss 10: హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 10 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక తాజాగా ఆయన రెమ్యూనరేషన్ వివరాలు తెలిసి ఆశ్చర్యపోతున్నారు.

on
- Advertisement -banner Ad

Bigg boss 10:ఎక్కడో పాశ్చాత్య దేశాలలో బిగ్ బ్రదర్ పేరిట ప్రారంభమైన ఒక రియాలిటీ షోని హిందీలో బిగ్ బాస్ పేరిట ప్రారంభించారు. ఓకే ఇంట్లో ఒకరితో ఒకరు సంబంధం లేని వ్యక్తులను 108 రోజులపాటు ఉంచి.. వారికి విభిన్నమైన టాస్కులు నిర్వహించి.. ప్రేక్షకులకు మంచి వినాధాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ బిగ్ బాస్ షో అన్ని భాషా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఇప్పుడు ప్రతి భాషలో కూడా ఈ షో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక అందులో భాగంగానే తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తి కాగా, ఇప్పుడు పదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది.

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ దశావతారం..

ఈ మేరకు ఇటీవల బిగ్ బాస్ సీజన్ 10(Bigg BOSS) మరిన్ని హంగులు, విశేషాలతో దశావతారం కాన్సెప్ట్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ కొత్త సీజన్ కి సంబంధించి వరుసగా ప్రోమోలు, అప్డేట్లు రివీల్ చేస్తూ సీజన్ 10 పై అంచనాలు పెంచుతున్నారు. పైగా ఈ సీజన్ 10.. మిగతా సీజన్ల కంటే కాస్త కలర్ ఫుల్ గా ఉండనుంది. ముఖ్యంగా ఈ రియాల్టీ షో ప్రారంభమై పదేళ్లయింది. అందుకే త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ ల్యాండ్ మార్క్ సీజన్ కోసం మరిన్ని హంగులు దిద్దనున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ ఎంపిక మొదలు గేమ్స్ , టాస్కులు ఇలా ప్రతి విషయంలో కూడా అంతకుమించి ఉండేలా బిగ్ బాస్ సీజన్ 10కు ఏర్పాట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

ALSO READ:Spirit Movie:వివాదంలో స్పిరిట్.. అన్యాయం చేశారంటూ మహిళ రైతు ఆవేదన!

హాట్ టాపిక్ గా మారిన హోస్ట్ రెమ్యునరేషన్..

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం ఒక ఎత్తు అయితే.. మరొకవైపు బిగ్ బాస్ షో కి అసలైన బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున(Nagarjuna). తొలి రెండు సీజన్లకు ఎన్టీఆర్, నాని హోస్టుగా వ్యవహరించగా.. మూడవ సీజన్ నుండి ఇప్పటివరకు నాగార్జున దాదాపు ఏడు సీజన్లకు హోస్టుగా వ్యవహరించారు. అంతేకాదు ఇప్పుడు రాబోయే ఈ పదవ సీజన్ కి కూడా ఆయనే హోస్టుగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. తన అద్భుతమైన వాక్చాతుర్యం, స్టైల్, వీకెండ్ క్లాసులతో బిగ్ బాస్ షోని ఒక టాప్ పొజిషన్లో నిలుపుతున్నారనటంలో సందేహం లేదు. అంతేకాదు నాగార్జున ఎంట్రీ ఇచ్చాకే ఈ రియాల్టీ షో మరింత రక్తి కట్టింది. అటు టిఆర్పి పరంగా మంచి స్థానాన్ని దక్కించుకుంది.

- Advertisement -

ఊహించని రేంజ్..

మరి ఈ షోకి పునాదిలా నిలిచిన నాగార్జున ఈ పదవ సీజన్ కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే విషయం వైరల్ కాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సీజన్ 9 కోసం రూ.35 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు పదవ సీజన్ కోసం ఏకంగా రూ.40 కోట్లకు పైగా ఫీజు తీసుకుంటున్నట్లు సమాచారం . ఒకవేళ ఇదే నిజమైతే టెలివిజన్ హిస్టరీలోనే ఒక రియాల్టీ టీవీ షో హోస్టింగ్ కి ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోగా, స్టార్ హోస్ట్ గా నాగార్జున నిలుస్తారు అనడంలో సందేహం లేదు.

ALSO READ:Maa inti Bangaram Review:మా ఇంటి బంగారం రివ్యూ.. తెలుగింటి కోడలు మెప్పించిందా?

- Advertisement -

బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్..

ఇకపోతే మరొకవైపు కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్, తేజస్విని గౌడ, పల్లవి గౌడ , యూట్యూబర్ నందు, ఎక్స్ప్రెస్ హరి, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ భార్య జ్యోతి ,నూకరాజు, కడలి సత్యనారాయణ, బుల్లితెర స్టార్ ప్రభాకర్ ఇలా కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు ఫైనల్ అయ్యారో తెలియాలి అంటే ఆగస్టు ఆఖరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం వరకు ఎదురు చూడాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you