Sunday, May 3, 2026
HomeBLOGPeddi Movie: అఫీషియల్.. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్

Peddi Movie: అఫీషియల్.. ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది' షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో..

Post by: Vamsi

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ (Peddi Movie) షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

‘పెద్ది’ షూటింగ్ పూర్తి (Peddi Movie)

జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్ లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అకడమిక్ సీజన్ మొదలయ్యే ముందు దేశ వ్యాప్తంగా మంచి ఫుట్‌ఫాల్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఒక భారీ సెట్‌లో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక అద్భుతమైన స్పెషల్ సాంగ్ చిత్రీకరణను చిత్ర బృందం పూర్తి చేయడంతో అధికారికంగా ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. ఈ ఎనర్జిటిక్ సాంగ్ ‘పెద్ది’ చిత్రంలోని మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా నిలవనుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సైమల్టేనియస్‌ గా వేగంగా సాగుతున్నాయి.

Also Read- TV Movies: మే 3, ఆదివారం టీవీలలో వచ్చే సినిమాలివే!

టాప్ టెక్నికల్ టీం

ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, అనుభవజ్ఞులైన నటులు శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్‌ అందిస్తున్నారు. ఇంటెన్స్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్స్ తో కూడిన రూరల్ స్పోర్ట్స్ కథాంశంగా రూపొందిన ‘పెద్ది’ హిందీతో పాటు అన్ని దక్షిణ భారత భాషలలో పాన్-ఇండియా స్థాయిలో ఘనంగా విడుదల కానుంది. పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ కు బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సుకుమార్ హాజరయ్యారు.

రామ్ చరణ్‌కు థాంక్యూ

పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. మీడియా అందరికీ థాంక్యూ. ఉప్పెన క్లైమాక్స్ చూసినప్పుడు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు పెద్ది కోసం మంచి స్క్రిప్ట్ రాశాడు. ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు. అలాంటి బ్యాలెన్స్ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. పెద్ది లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్ పై సాంగ్స్ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్‌లో అనిపించింది. రత్నవేలు గారు గ్రేట్ విజువల్స్ ఇచ్చారు. చరణ్‌ని అద్భుతంగా చూపించినందుకు థాంక్యూ. మొన్న వచ్చిన టీజర్ విజువల్స్ మామూలుగా లేవు. సతీష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన మొదటి సినిమాకే రామ్ చరణ్ లాంటి హీరో, బుచ్చిబాబు లాంటి దర్శకుడు దొరకడం ఆయన అదృష్టం. చరణ్ డాన్స్ చూస్తుంటే మాటలు రావడం లేదు.. అంత అద్భుతమైన ఎనర్జీతో డాన్స్ చేశాడు. ‘పెద్ది’లో చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం ను దాటి నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. బుచ్చిబాబు, సతీష్ గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్ చరణ్‌కు థాంక్యూ. ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా థాంక్యూ. జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. హిందీలో జియో వారు విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా భారీ రిలీజ్ ఉంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. సినిమాను సూపర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను.

Also Read- VD Shouryuv: విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శౌర్యువ్ మూవీ లాంచ్

అంత ఈజీ కాదు

మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుకుమార్ గారికి థాంక్యూ. ‘పెద్ది’ ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి.(నవ్వుతూ) ఇది ఒక కమర్షియల్ ఎమోషనల్ రైడ్. మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది. పెద్ది ని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. చరణ్ సార్‌పై నా ప్రేమ జూన్ 4న మీరు చూస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి థాంక్యూ సో మచ్.

జీవితంలో మర్చిపోలేను

ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ: మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. రామ్ చరణ్ గారికి జీవితకాలం రుణపడి ఉంటాను. నా మొదటి సినిమాగా ఇంత పెద్ద సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. బుచ్చిబాబు చాలా అద్భుతంగా సినిమా తీశారు. రామ్ చరణ్ గారు, జాన్వి కపూర్ గారు ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ప్రేక్షకులందరికీ గుర్తుండిపోయే సినిమా ఇది. తప్పకుండా థియేటర్లకు వచ్చి చూడండి. పెద్ది కమర్షియల్, ఎమోషనల్ రైడ్ ఇది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ థియేటర్స్ లో చూడగలిగే సినిమా. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది, నిర్మాతగా చాలా హ్యాపీగా ఉన్నాను. జూన్ 4న సినిమా రిలీజ్ అవుతోంది. జూన్ 3 ఈవెనింగ్ అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి. షూటింగ్ జరిగిన రోజులన్నీ రామ్ చరణ్ గారితో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చిన భోజనం మాకు పెట్టేవారు. ఆ అనుభవం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ వేడుకకు విచ్చేసిన సుకుమార్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో సుకుమార్ గారు కూడా నాకు పార్ట్నర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉంది.

Also Read- Kara Trailer: ధనుష్ ‘కర’ మూవీ తెలుగు ట్రైలర్

రంగస్థలం వైబ్

డివోపీ రత్నవేలు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘పెద్ది’ కోసం ప్రాణం పెట్టి పని చేశాను. బుచ్చిబాబు గారు అద్భుతమైన కథ రాశారు. ఆ కథకు నేను విజువల్ ఇచ్చాను. సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు ఇలా గొప్ప టీమ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఈ టీమ్‌ను చూస్తే రంగస్థలం వైబ్ గుర్తుకు వస్తుంది. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్, బుచ్చిబాబు గారి స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్ అన్నీ అద్భుతంగా వచ్చాయి. కమర్షియల్‌గా డిఫరెంట్‌గా ట్రై చేశాం. తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాను.

Also Read- Kanna Movie: ‘కన్న’ మూవీ టీజర్ లాంఛ్ ఫొటోలు

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

GUEST BLOG POSTS

Related articles