Kannada Actors:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలన్ పాత్రలకు ఎప్పుడు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా ప్రతినాయక పాత్రలు నడుస్తూ ఉంటాయి. ఒకప్పుడు బాలీవుడ్, తమిళ చిత్ర సీమకు చెందిన నటులు టాలీవుడ్ లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్ లో కనిపించే వాళ్ళు. అయితే ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారిపోతుంది. ప్రస్తుతం తెలుగు దర్శకులు, నిర్మాతల దృష్టి కన్నడ చిత్ర పరిశ్రమపై పడింది. అక్కడి నటులు తమ సహజ నటన రగడలు పవర్ఫుల్ స్క్రీన్ ప్రజెంట్ తో టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు.
జాలిరెడ్డి తో గుర్తింపు తెచ్చుకున్న డాలీ ధనుంజయ్ :
కన్నడ నటుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు డాలీ ధనుంజయ్. అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రంలో ఆయన పోషించిన జాలిరెడ్డి పాత్ర ప్రేక్షకులపై ఘాడమైన ముద్ర వేసేసింది. కథలో కీలక మలుపులకు కారణమైన ఈ పాత్ర సినిమాకు మరింత బలం చేకూర్చిందని అభిప్రాయం సినీ విశ్లేషకుల్లో కూడా వ్యక్తం అయింది. తక్కువ సన్నివేశాలే ఉన్న తన నటనతో ధనంజయ్ ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
ALSO READ:OTT : 7.8 IMDb రేటింగ్‌తో వస్తున్న మైండ్‌బ్లోయింగ్ థ్రిల్లర్..చివరి 20 నిమిషాలు మైండ్ బ్లాంక్..!
కొత్త చిత్రాలలోను కొనసాగుతున్న ట్రెండ్:
ఇటీవల విడుదలైన పలు భారీ చిత్రాలలో కూడా కన్నడ నటుల ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తుంది. లెనిన్ చిత్రంలో “ప్రమోద్ పంజూ” తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. “పుష్ప2- ది రూల్” లో తారక్ పొన్నప్ప తన క్రూరమైన విలనీజ్మ్ ..బలమైన స్క్రీన్ ప్రజెంట్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. వీరి నటన సినిమాల్లో ప్రతినాయక పాత్రలకు మరింత బలం చేకూర్చింది.
ALSO READ:Anna Rajan:మార్ఫింగ్‌తో హీరోయిన్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ బ్యూటీ..!
ఎందుకు కన్నడ నటులకే ప్రాధాన్యం :
కన్నడ నటుల (Kannada Actors)ప్రత్యేకత కేవలం డైలాగ్ డెలివరీలోనే కాదు వారి కళ్ళల్లో కనిపించే తీవ్రత.. సహజమైన బాడీ లాంగ్వేజ్, పాత్రల్లో పూర్తిగా లీనమైపోయే తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మాస్ యాక్షన్ చిత్రాలలో అవసరమైన రగ్డ్ లుక్ వారికి సహజంగా ఉండడం దర్శకులను ఆకర్షిస్తుంది.
మరిన్ని ఎంట్రీలకు సిద్ధం:
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ట్రెండ్ చూస్తే భవిష్యత్తులో మరింత మంది కన్నడ నటులు టాలీవుడ్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు ప్రేక్షకులు కూడా బలమైన విలన్ పాత్రలను ఆదరిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో కన్నడ నటుల ప్రభావం తెలుగు చిత్రసీమలో మరింత పెరిగే అవకాశం ఉంది అంటూ సినీ వర్గాలు భావిస్తున్నాయి.




