OTT :ఓటిటి వేదికలపై సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సన్ నెక్స్ట్ మరో ఆసక్తికరమైన కన్నడ ఇన్వెస్టిగేషన్ డ్రామాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురాబోతుంది. “కమల్ శ్రీదేవి” పేరుతో రూపొందిన ఈ చిత్రం జూలై 17 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్(OTT ) కాబోతుంది. విడుదలకు ముందే ఈ సినిమాకు ఐఎండిబి లో 7.8 రేటింగ్ లభించడం విశేషం అనే చెప్పాలి.
హత్య వెనుక దాగిన మిస్టరీ:
బెంగళూరులోని రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో జరిగిన శ్రీదేవి అనే మహిళ హత్యతో కథ ప్రారంభమవుతుంది. ప్రమాదం నుంచి ఆమెను కాపాడేందుకు కమల్ ఎంత ప్రయత్నించినా చివరికి విఫలమైపోతాడు. ఆ తర్వాత ఈ కేసు అనేక అనుమానాలు, మలుపులతో ముందుకు సాగుతుంది. శ్రీదేవిని ఎందుకు హత్య చేశారు..? అసలు నిందితుడు ఎవరు..? ఈ ఘటన వెనుక దాగి ఉన్న రహస్యాలు ఏంటి..? కమల్ ఈ విచారణలో ఎలా కీలకపాత్ర పోషించాడు. అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.
ALSO READ:Anna Rajan:మార్ఫింగ్‌తో హీరోయిన్‌కు వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన స్టార్ బ్యూటీ..!
ప్రత్యేకంగా నిలిచే కథనం :
ఈ చిత్రానికి ప్రధాన బలం దాని స్క్రీన్ ప్లే. ఒకే హత్య కేసును ఏడుగురు వ్యక్తుల దృష్టి కోణంలో చూపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచ సినీ చరిత్రలో ‘రషోమోన్ ఎఫెక్ట్’ గా ప్రసిద్ధి చెందిన ఈ కథన శైలి ప్రేక్షకులలో ఆసక్తిని మరింత పెంచేస్తుంది. ప్రతి పాత్ర చెప్పే వివరాలు మారుతూ ఉండడంతో అసలు నిజం ఏంటి..? అబద్ధం ఏది..? అనే సందేహాలు చివరి వరకు కొనసాగుతూ ఉంటాయి.
ALSO READ:Simran choudhary: తొలకరి జల్లులలో తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న సిమ్రాన్!
ధ్రిల్ కోరుకునే వారికి బెస్ట్ చాయిస్:
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వస్తున్న రియలిస్టిక్ క్రైమ్ ధ్రిల్లర్ కు ఇటీవల కాలంలో మంచి ఆదరణ లభిస్తుంది. బెంగళూరు మార్కెట్ వాతావరణాన్ని సహజంగా చూపించిన సినిమాటోగ్రఫీ ప్రతి సన్నివేశంలో ఉత్కఠ పెంచే నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి. మిస్టరీ సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు “కమల్ శ్రీదేవి” తప్పకుండా ఆసక్తికరమైన అనుభూతిని అందించే అవకాశం ఉంది..!!




