Thursday, July 23, 2026
HomeINTERVIEWSRekha Vedavyas:బిగ్ బాస్ 10లోకి కుర్రాళ్ల గ్లామర్ క్రష్?..స్వయంగా స్పందించిన హీరోయిన్!

Rekha Vedavyas:బిగ్ బాస్ 10లోకి కుర్రాళ్ల గ్లామర్ క్రష్?..స్వయంగా స్పందించిన హీరోయిన్!

Rekha Vedavyas:తెలుగు హీరోయిన్ రేఖ వేదవ్యాస్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో పాల్గొంటారనే వార్తలపై స్పందించారు.

on
- Advertisement -banner Ad

Rekha Vedavyas:రేఖ వేదవ్యాస్.. ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలు చాలా చాలా తక్కువ. ఎవరు ఆమె..?? అని ఆలోచించుకోవడానికి కచ్చితంగా నిమిషమైనా తీసుకుంటారు. అదే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో హీరోయిన్గా నటించిన బ్యూటీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాతో పాపులారిటీ సంపాదించుకునింది రేఖ రేఖ వేదవ్యాస్. తన పేరుతో కన్నా ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా హీరోయిన్ అని ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరియర్ , ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు తనను ఎంతో మార్చాయని వాటి నుంచి ఎంతో నేర్చుకున్నాను అని ఆమె తెలిపారు

కష్టకాలం ఎంతో నేర్పింది :

తన జీవితంలో వచ్చిన కఠిన పరిస్థితుల గురించి మాట్లాడిన రేఖ రేఖ వేదవ్యాస్(Rekha Vedavyas).. చిన్న వయసులోనే అనుకోని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది అని చెప్పారు. అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాను అని చాలా రోజులు ఏడ్చాను అని.. అలాంటి పరిస్థితులను అర్థం చేసుకొని వాటికి అలవాటు పడేందుకు చాలా సమయం పట్టింది అంటూ ఎమోషనల్ గా స్పందించారు. అయితే పరిస్థితులకు అనుగుణంగా మనిషి మారగలడం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు. గతంలో తన ఆరోగ్య సమస్యల గురించి వస్తున్న వార్తలపై స్పందించిన రేఖ.. అది తన జీవితంలోని ముగిసిన ఒక అధ్యాయమని.. దేవుడు దయతో ఇప్పుడు పూర్తిగా కోరుకున్నాను అని ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement

ALSO READ:OG:టీవీలోకి పవన్ కళ్యాణ్ ఓజీ..ఎందులో అంటే?

ముంబైలోనే నివాసం అవకాశాలకు సిద్ధం:

ప్రస్తుతం ముంబైలోనే నివసిస్తున్నాను అని హైదరాబాద్ కి రావడం పెద్ద విషయం ఏం కాదు అని రేఖ చెప్పుకొచ్చారు. అవసరమైతే ఎక్కడి నుంచైనా పనిచేయడానికి సిద్ధమేనంటూ క్లారిటీ ఇచ్చారు. పెళ్లి కాలేదన్న కారణంగా అవసరమైతే హైదరాబాద్ కి కూడా మారెందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అని స్పష్టం చేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:Jananayagan:ఇంకొన్ని గంటల్లో “జన నాయగన్‌” రిలీజ్.. పూజా హెగ్డేకు ఊహించని షాక్..!

బిగ్బాస్ పై క్లారిటీ:

బిగ్ బాస్ షోలో పాల్గొనే విషయంపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రేఖా వేద వ్యాస్ బిగ్ బాస్ లోకి వెళ్తుంది అంటూ చాలా వార్తలు వినిపించాయి. దాని గురించి వివరణ ఇస్తూ ఆ షోలో కంటెస్టెంట్ గా ఉండాలి అంటే ఎంతో ధైర్యం కావాలి కెమెరాల మధ్య నిరంతరం ఉండడం టాస్కులు చేయడం.. నా మైండ్ సెట్ కి సరిపడదు. అయితే గెస్ట్ గా లేకపోతే ప్రత్యేకమైన క్రియేటివ్ కాన్సెప్ట్ ఉంటే కచ్చితంగా వెళ్తాను అంటూ చెప్పుకు వచ్చింది. ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఆజానర్ లో చేయాలి.. ఈ జోనర్లో చేయాలి అంటూ నాకు పెద్దగా ఆశలు లేవు.. ఏదైనా సరే ప్రేక్షకులను మెప్పించ గలిగే పాత్ర వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you