Saturday, July 25, 2026
HomeLATESTNagabandham: ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం!

Nagabandham: ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం!

Nagabandham: విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగబంధం సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

on
- Advertisement -banner Ad

Nagabandham:టాలీవుడ్ యంగ్ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో తాజాగా నటించిన ఫాంటసీ పీరియాడిక్ అడ్వెంచర్ చిత్రం నాగబంధం(Nagabandham). జూలై 3వ తేదీన ఈ సినిమా థియేటర్లోకి విడుదల అయ్యింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో కేవలం విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమయ్యింది. ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అభిషేక్ నామా విజువల్ వండర్ గా తెరకెక్కించారు. విడుదలకు ముందే భారీ అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడ్డాయి. కానీ థియేటర్లో మాత్రం ఈ సినిమాకి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది.

ఓటీటీలోకి వచ్చేసిన నాగబంధం..

ఇప్పుడు తాజాగా ఓటీటీ ప్లాట్ఫారం లోకి ఎంట్రీ ఇచ్చింది. విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటించారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ తో ప్రేక్షకులలో అంచనాలను పెంచేసింది. కానీ అనుకున్నంత స్థాయిలో కథ, స్క్రీన్ ప్లే లేకపోవడంతో సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రంలో ఉండే యాక్షన్ సీన్స్ విజువల్ ట్రీట్ , పీరియాడిక్ నేపథ్యం మాత్రం సినిమాకు ప్రశంసలు అందించింది. ముఖ్యంగా ఈ సినిమాని థియేటర్లో చూడలేకపోయినా అభిమానులు ఓటీటి లో చూడవచ్చు.

- Advertisement -
Advertisement

also read:Jana Nayagan:విజయ్‌తో నటించిన సన్నివేశాలే కట్.. ఆనంది ఎమోషనల్ వీడియో..!

అసలు ట్విస్ట్ ఏంటంటే?.

ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న యూజర్స్ కి సైతం అమెజాన్ ప్రైమ్ ఓటిటి సంస్థ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుంది. నేటి నుంచి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. హిందీ భాషలో తప్ప మిగిలిన భాషలలో ఈ సినిమా వీక్షించే అవకాశం కల్పించారు. మరి థియేటర్లో ఈ సినిమాని మిస్ అయిన ప్రేక్షకులతో పాటు ఫాంటసీ మైథాలజికల్ సినిమాలు ఇష్టపడే వారికి నాగబంధం సినిమా ఈ వీకెండ్ మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉండనుంది. మరి థియేటర్లో ఒక మోస్తారుగా ఆకట్టుకున్న ఈ సినిమాకి ఓటీటిలో ఏవిధంగా ఆదరణ లభిస్తుందో చూడాలి మరి.

- Advertisement -
Advertisement

also read:Jana Nayagan :జననాయగన్ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్!

వారి ఆశలు అడియాశలేనా?

హీరో విరాట కర్ణ మొదట పెద్దకాపు 1 చిత్రంతో హీరోగా మారినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ రెండవ సినిమానే నాగబంధం భారీ బడ్జెట్ సినిమా అయినా ఈ సినిమాతో యాక్టింగ్ పరంగా పేరు సంపాదించారు. ఈ సినిమా మీద హీరోయిన్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఆశలు పెట్టుకున్నప్పటికీ వారి అంచనాలను సైతం అందుకోలేకపోయింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you