Film industry: 2026 క్రిస్మస్ బాక్సాఫీస్ వద్ద కనివిని ఎరుగని రీతిలో రసవత్త పోరు జరగబోతోంది. ఇండియన్ సినీ చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పండుగ సీజన్ క్లాష్ రావడం సర్వసాధారణమే. అయితే ఈసారి మాత్రం ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు క్రిస్మస్ బరిలో దిగబోతున్నారు. కింగ్ అనే ఒక టైటిల్ బ్రాండ్ తో ఇద్దరు దిగ్గజ హీరోలు కూడా ఒకేరోజు బరిలోకి దిగబోతూ (Film industry)ఉండడం అటు అభిమానులను ఆశ్చర్యానికి గురయ్యాలా చేస్తోంది. టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 100వ చిత్రం కింగ్.
ఒకేపేరుతో 2 చిత్రాలు విడుదల..
అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన షారుఖ్ ఖాన్ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కింగ్.. ఈ రెండు చిత్రాలు డిసెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. ఇక అదే రోజున నందమూరి బాలకృష్ణ మాస్ ఎంటర్టైన్మెంట్ గా రాబోతున్న చిత్రం దాదా. దీంతో థియేటర్ దగ్గర త్రిబుల్ ధమాకా ఉండడం ఖాయమని పలువురు నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఒకవైపు నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్, మరొకవైపు నాగార్జున 100వ సినిమా కావడం చేత ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కింగ్ అనే పదంతో ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
also read:Garividi Lakshmi :గరివిడి లక్ష్మి సంచలన వ్యాఖ్యలు.. ఆర్పీ పట్నాయక్‌పై తీవ్ర ఆరోపణలు!
రంగంలోకి బాలయ్య మూవీ కూడా..
అక్కినేని నాగార్జున కెరియర్ లో కింగ్ అనేది ఒక నిక్ నేమ్ గా మారిపోయింది. ఆయన కెరీర్ లోనే బెస్ట్ కమర్షియల్ టైటిల్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు తన వందో సినిమాకి కూడా అదే గుర్తింపు వచ్చేలా కింగ్ 100 అనే ఒక పవర్ఫుల్ టైటిల్ ని ఖరారు చేయడం జరిగింది. డైరెక్టర్ ఆర్ఏ కార్తీక్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ హీరోయిన్ టబు తో పాటుగా సుష్మిత భట్ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీప్రసాద్ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ లభించింది.
also read:Poorna:జైలర్ 2 సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు.. పాప డ్యాన్స్‌కు ఫిదా అయిన పూర్ణ!
అసలు సిసలైన వార్..
మరొకవైపు బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న కింగ్ సినిమా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీలో షారుక్ ఖాన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా రఫ్ అండ్ టఫ్ లుక్కులో కనిపించబోతున్నారు. రక్తపు మరకలు, చేతిలో తుపాకీతో విడుదలైన లుక్ మరింత అంచనాలను పెంచేసింది. ఇందులో అభిషేక్ బచ్చన్ విలన్ గా కనిపించబోతున్నారు. దీపికా పదుకొనే, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ వంటి వారు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 24న రిలీజ్ చేయబోతున్నారు.
తప్పుకునేది ఎవరు?
అటు నాగార్జున , ఇటు షారుఖ్ ఖాన్ మధ్య పోటీ పడుతూ ఉన్నప్పటికీ డిసెంబర్ 24న డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న దాదా సినిమా కూడా విడుదలవుతోంది. మరి ఈ ముగ్గురు హీరోలలో ఎవరు వెనక్కి తగ్గుతారు? ఎవరు సినిమా డేట్ ను అడ్జస్ట్ చేస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. లేదా ముగ్గురు హీరోలు తమ సినిమాలతో అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి.
Both King Films Are Coming on the Same Day !!
– #ShahRukhKhan’s #King December 24th
– Nagarjuna’s #King100 December 24th https://t.co/vHtoGFce3O
— Telugu Chitraalu (@CineChitraalu) October 27, 2026




